corona: రెండోరోజు స్వల్పంగా పెరిగిన కేసులు

తాజా వార్తలు

Published : 27/05/2021 10:05 IST

corona: రెండోరోజు స్వల్పంగా పెరిగిన కేసులు

మరోసారి 4వేల దిగువకు మరణాలు

24లక్షలకు చేరిన క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టినట్టే కనిపించిన కొత్త కేసులు వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగాయి. మృతుల సంఖ్య నాలుగువేల దిగువకు చేరింది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు విడుదల చేసింది. 

బుధవారం 21,57,857మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,11,298మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. వరసగా రెండోరోజు రెండు లక్షలపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. సుమారు 40 రోజులు తరవాత మే 24న రోజూవారీ కేసులు రెండులక్షల(1,96,427) దిగువకు చేరాయి. అలాగే 24 గంటల వ్యవధిలో 3,847మంది కన్నుమూశారు. ఇప్పటివరకు 2,73,69,093మందికి కరోనా సోకగా..3,15,235మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ.. మరణాలు మాత్రం భారీగా నమోదవుతున్నాయి. అక్కడ 24,752మంది కరోనాబారిన పడగా..992మంది మరణించారు. ఆ తరవాత కర్ణాటక(530), తమిళనాడు(475)లో ఎక్కువ సంఖ్యలో మహమ్మారికి బలయ్యారు. దేశవ్యాప్తంగా ఒక్క తమిళనాడులోనే 30వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. 

ఇక క్రియాశీల కేసుల్లో తగ్గుదల, రికవరీలు పెరుగుతుండటం ఊరటనిచ్చే అంశాలు. 24,19,907మంది కొవిడ్‌తో బాధపడుతుండగా..క్రియాశీల కేసుల రేటు 9.19 శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 2,83,135మంది కోలుకున్నారు. వరసగా 14వ రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తంగా 2.46 కోట్లమందికి పైగా వైరస్ నుంచి బయటపడగా..రికవరీ రేటు 89.66 శాతానికి చేరింది. మరోవైపు, నిన్న 18,85,805మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 20,26,95,874గా ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని