స్టాండింగ్‌ కమిటీ ముందుకు ట్విటర్‌, ఐటీ శాఖ
close

తాజా వార్తలు

Published : 18/06/2021 13:27 IST

స్టాండింగ్‌ కమిటీ ముందుకు ట్విటర్‌, ఐటీ శాఖ

దిల్లీ: ట్విటర్‌ ఇండియా ప్రతినిధులు సహా, కేంద్ర ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారులను ఈరోజు పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రశ్నించనుంది. సామాజిక మాధ్యమాల్లో పౌరుల హక్కులు, ఆన్‌లైన్ వార్తా సంస్థల వేదికల దుర్వినియోగంపై  కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ ఐటీ సంఘం.. అధికారుల వివరణను విననుంది. ముఖ్యంగా డిజిటల్‌ మాధ్యమాల్లో మహిళల భద్రతపై వివరణ కోరనుంది.

ప్రభుత్వం, ట్విటర్‌ మధ్య తీవ్ర స్థాయి విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయడంలో ట్విటర్‌ జాప్యం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ట్విటర్‌కు ఉన్న ‘తృతీయ పక్ష’ హోదాను ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై వినియోగదారులు ఏవైనా అభ్యంతరకర పోస్ట్‌లు పెడితే దానికి ట్విటర్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. భారత శిక్షా స్మృతి ప్రకారం శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని