close

ప్రధానాంశాలు

Updated : 21/04/2021 02:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

షెడ్యూల్‌ ప్రకారమే డబ్ల్యూటీసీ ఫైనల్‌

దుబాయ్‌: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 18న సౌథాంప్టన్‌లో మొదలవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. భారత్‌లో కొవిడ్‌ కేసులు అమాంతం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ను సురక్షితం కాని దేశాల్లో ఒకటిగా చేర్చింది. ఇక్కడి నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఆంక్షలు విధించింది. భారత్‌ నుంచి బ్రిటన్‌కు వస్తే పది రోజుల హోటల్‌ క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది. మున్ముందు ఆంక్షలు మరింత పెరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో జూన్‌లో జరగాల్సిన డబ్ల్యూటీసీ ఫైనల్‌పై సందేహాలు తలెత్తాయి. అయితే ఐసీసీ మాత్రం మ్యాచ్‌ యధావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది. ‘‘కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటూ క్రికెట్‌ మ్యాచ్‌లు ఎలా సురక్షితంగా నిర్వహించాలో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డుతో పాటు ఇతర దేశాల నిర్వాహకులు చూపించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ విషయంలోనూ అదే పద్ధతిని అనుసరిస్తాం’’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన