హార్దిక్‌ బౌలింగ్‌ చేయొచ్చు: రోహిత్‌

ప్రధానాంశాలు

Published : 21/10/2021 03:52 IST

హార్దిక్‌ బౌలింగ్‌ చేయొచ్చు: రోహిత్‌

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేస్తాడని భావిస్తున్నట్లు రోహిత్‌ శర్మ చెప్పాడు. ‘‘హార్దిక్‌ పరిస్థితి ఇప్పుడు బాగుంది. బౌలింగ్‌ చేయడానికి కాస్త సమయం పడుతుంది. అతడింకా బౌలింగ్‌ మొదలెట్టలేదు. కానీ టోర్నమెంట్‌ ఆరంభమయ్యే సమయానికి బౌలింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మా ప్రధాన బౌలర్లలో నాణ్యత ఉంది. కానీ మాకు ఆరో బౌలర్‌ కావాలి’’ అని అన్నాడు. కొంతకాలంగా హార్దిక ఫిట్న్‌ెస్‌పై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో అతడు బౌలింగ్‌ చేయలేదు. జట్టు సమతూకానికి హార్దిక్‌ బౌలింగ్‌ కీలకమని జట్టు మేనేజ్‌మెంట్‌ చెబుతూ వస్తోంది. ఆస్ట్రేలియాతో సన్నాహక మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు రోహిత్‌ నాయకత్వం వహించాడు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన