హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ముష్కరులకు జైలుశిక్ష

ప్రధానాంశాలు

Published : 26/10/2021 05:19 IST

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ముష్కరులకు జైలుశిక్ష

దిల్లీ: ఉగ్రవాద ముఠా హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన మహ్మద్‌ షఫీ షా, ముజఫర్‌ అహ్మద్‌ దార్‌లకు దిల్లీ కోర్టు సోమవారం 12 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఈ ముఠాకే చెందిన తాలిబ్‌ లాలి, ముస్తాక్‌ అహ్మద్‌ లోన్‌లకు 10 ఏళ్ల చొప్పున శిక్ష ఖరారు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటానికి కుట్ర పన్నడంతోపాటు ముష్కరులకు నిధులు సమకూర్చారని న్యాయస్థానం పేర్కొంది. దేశ మూలాలపై దాడి చేయడానికి వీరు కుట్ర పన్నారని వ్యాఖ్యానించింది. ముష్కరులకు నిధులు అందించడం కూడా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడటం లాంటిదేనని ప్రత్యేక న్యాయమూర్తి పర్వీన్‌ సింగ్‌ పేర్కొన్నారు. హిజ్బుల్‌కు షఫీ షా.. డివిజినల్‌ కమాండర్‌గా ఉండేవాడు. అతడు రాజద్రోహానికి పాల్పడ్డాడని, అతడి నేరం వల్ల సమాజంపై పెను ప్రభావం పడిందని జడ్జి వ్యాఖ్యానించారు. తాము ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం కలిగించే  కార్యకలాపాలకు పాల్పడలేదన్న నిందితుల వాదనను తోసిపుచ్చారు.

షా, లాలిలు జమ్మూ-కశ్మీర్‌లోని బందీపొర జిల్లా వాసులు కాగా దార్‌ది బద్గామ్‌ జిల్లా. లోన్‌ స్వస్థలం అనంత్‌నాగ్‌ జిల్లా. వీరు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించడానికి పొరుగు దేశాల నుంచి నిత్యం నిధులు అందుకుంటున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కేసు నమోదు చేసింది. డబ్బును చేరవేయడానికి ‘జమ్మూ-కశ్మీర్‌ అఫెక్టీస్‌ రిలీఫ్‌ ట్రస్టు’ (జేకేఏఆర్‌టీ) అనే సంస్థను ఉపయోగించుకుంటున్నారని పేర్కొంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన