
తాజా వార్తలు
పుట్టిన నెలరోజులకే శిశువుకు ప్రాణాంతక వ్యాధి
హైదరాబాద్: తమకు బిడ్డ పుట్టాడని ఆ పేద తల్లిదండ్రులు మురిసిపోయారు. అతడి ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలూ శ్రమిద్దామనుకున్నారు. కానీ, బిడ్డ పుట్టిన నెల రోజులకే ఆసుపత్రి పాలవ్వడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బిడ్డను బతికించుకోవడానికి ఉన్నదంతా ఖర్చు చేశారు. అంతలోనే మరో ప్రాణాంతక వ్యాధి కబళిస్తుందని తెలియగానే హతాసులైయ్యారు. చేతుల్లో డబ్బులు లేక ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి గల్ఫ్ వెళ్లిపోయాడు. బిడ్డను కాపాడుకోవడానికి పేగుబంధంతో ఆ తల్లి పడుతున్న బాధ అందరిని కంటతడి పెట్టిస్తోంది.
కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుపేదలైన మల్లీశ్వరి, రంజిత్ దంపతులకు పెద్ద కష్టమే వచ్చి పడింది. కొడుకు పుట్టాడని సంతోషాన్ని ఆస్వాదించేలోపే.. బిడ్డకు తీవ్రమైన వ్యాధి అని తెలిసి వారు తల్లడిల్లిపోతున్నారు. బాబు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన తల్లిదండ్రులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాబుకు ఊపిరితిత్తుల వ్యాధి ఉందని వైద్యులు నిర్ధరించారు. వెంటనే వారు హైదరాబాద్ తార్నాకలోని సురక్షా చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించారు. కానీ గుండెకు సంబంధించిన మరో ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు హతాసులైయ్యారు. బిడ్డకు వైద్యం కోసం తమ వద్ద ఉన్న రూ.3 లక్షలతోపాటు తల్లిదండ్రుల వద్ద నుంచి మరో రూ.2 లక్షలను తెచ్చి ఖర్చు చేసింది మల్లీశ్వరి. అయినా జబ్బు నయం కాకపోవడంతో డబ్బు సంపాదన కోసం భార్యాబిడ్డలను ఆసుపత్రిలోనే ఉంచి భర్త (రంజిత్) దేశం కాని దేశం వెళ్లిపోయాడు.
తోడుగా ఉండాల్సిన భర్త గల్ఫ్‌కు వెళ్లిపోవడం, ముసిముసి నవ్వులతో మురిపించాల్సిన కొడుకు వెంటిలేటర్‌పై ఉండడం ఈ తల్లి గుండెలవిసేలా రోధిస్తోంది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా అత్త పట్టించుకోకపోవడం ఆమెను మరింత కుంగదీస్తోంది. దీంతో మల్లీశ్వరి తల్లిదండ్రులే అంతా చూసుకుంటున్నారు. ఆసుపత్రిలో ఒక్కరోజుకే రూ.14వేలు ఖర్చవుతుండడంతో ఆ తల్లి విలవిల్లాడిపోతోంది. చేతిలో ఉన్న డబ్బంతా అయిపోవడం, ఆసుపత్రి బిల్లులన్నీ తడిసిమోపెడవుతుండడంతో ఆ తల్లికి ఏమి చేయాలో దిక్కు తోచక విలపిస్తోంది. ఎలాగైనా తమ బిడ్డను కాపాడుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ సహాయం చేయాల్సిందిగా దీనంగా దాతలను వేడుకుంటుంది.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- శ్వేతసౌధంలో ఏకాకి!
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
