close

తాజా వార్తలు

తాత రజనీకి తగ్గ మనవడు!

ఫొటో షేర్‌ చేసిన సౌందర్య రజనీకాంత్‌

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్ కుమార్తె సౌందర్య కుమారుడు వేద్‌ తాతయ్యకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. అచ్చం తాతలా పోజిచ్చి సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. సౌందర్య మంగళవారం తన తండ్రి, కుమారుడు ఫొటోల్ని జత చేసి ఓ పోస్ట్‌ చేశారు. ‘తాతలాగే మనవడు కూడా..’ అంటూ వేద్‌ తాత పోజులో అదరగొట్టారు, తల్లిగా గర్వపడుతున్నా అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా పోస్ట్‌ చేశారు. ఇటీవల ‘దర్బార్‌’ సెట్‌కు వేద్‌ వెళ్లాడు. అక్కడ తాతయ్యతో కలిసి సమయం గడిపాడు. ఈ సందర్భంగా రజనీ వేద్‌ను ఎత్తుకుని ఉన్న ఫొటోను సౌందర్య షేర్‌ చేశారు. ‘నా ప్రపంచం, లైఫ్‌లైన్స్‌, నా ప్రియమైన తండ్రి, బాబు వేద్‌’ అని ట్వీట్‌ చేశారు. అప్పట్లో ఈ ఫొటోను ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేశారు.

రజనీ ఇటీవల ‘పేట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం ఆయన ‘దర్బార్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార కథానాయిక. అనిరుధ్‌ బాణీలు అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.