close

తాజా వార్తలు

24 ఉద్యోగాల భర్తీ వ్యయం 3.5 కోట్లు!

ఇదీ ఎఫ్‌ఆర్‌వో ఖాళీల పరిస్థితి
10న జరగాల్సిన ప్రిలిమ్స్‌ వాయిదా
  ఏపీపీఎస్సీ వెల్లడి

అమరావతి: అటవీ శాఖలో 24 ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్‌వో) ఉద్యోగాల భర్తీకి ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు రూ.3.5కోట్ల వరకు ఖర్చు కానుంది! అంటే ఒక ఉద్యోగిని తీసుకునేందుకు అయ్యే సగటు వ్యయం రూ.14.50లక్షల పైమాటే. 16,130 దరఖాస్తులు రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఎక్కువ మొత్తంలో ఖర్చు కనిపిస్తోండడంతో ప్రిలిమ్స్‌ నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై ఏపీపీఎస్సీ సందిగ్ధంలో పడింది. ఈలోగా మార్చి 10న జరగాల్సిన ప్రిలిమ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది.

దరఖాస్తులు 25వేలు దాటితే
25వేల వరకు దరఖాస్తులు వస్తే ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్‌) జరపాలనేది కమిషన్‌ నిర్ణయం. ప్రిలిమ్స్‌ను ఆఫ్‌లైన్‌లో, ప్రధాన పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్‌ నిర్వహిస్తే ప్రధాన పరీక్షలకు అర్హత సాధించేవారు పరిమితంగానే ఉంటారు. దీనివల్ల ఆర్థికంగా పెద్ద సమస్య ఉండదు. ఈ ఉద్యోగాలకు నిర్ణయించిన వేర్వేరు అర్హతల దృష్ట్యా ఒకవేళ ఒకే పరీక్షను నిర్వహించాలనుకుంటే ఐదు పేపర్లను ఆన్‌లైన్‌లో ఇవ్వాలి. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పరీక్ష నిర్వహించడానికి సుమారు రూ.350 వరకు ఖర్చవుతుంది. ఐదు పేపర్లకు కలిపి ఒక్కొక్కరిపై రూ.1,750 చొప్పున మొత్తంమీద రూ.2.80 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇతర ఖర్చులు అదనం. మొత్తంగా రమారమి రూ.3.5కోట్ల వ్యయమవుతుంది. అభ్యర్థుల నుంచి దరఖాస్తు పరిశీలన రుసుముగా రూ.250, పరీక్ష రుసుముగా రూ.120 చొప్పున ఏపీపీఎస్సీ వసూలు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెల్ల రేషన్‌కార్డుదారులకు మినహాయింపుంది. దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఒకే పరీక్షను నిర్వహించే పక్షంలో సర్కారు అనుమతి అవసరం. దీనిపై కమిషన్‌ ప్రభుత్వంతో సంప్రదిస్తోంది. ఈలోగా మార్చి 10న జరగాల్సిన ప్రిలిమ్స్‌ను  పాలనపరమైన కారణాలతో వాయిదా వేస్తున్నట్లు కార్యదర్శి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రిలిమ్స్‌ను మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ  త్వరలో ప్రకటిస్తామన్నారు.

స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 109 విస్తరణాధికారుల పోస్టుల భర్తీకి 15,217 దరఖాస్తులు వచ్చాయి. ప్రిలిమ్స్‌ కింద ఒకటి, ప్రధాన పరీక్షల కింద రెండు చొప్పున మూడు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.