close

తాజా వార్తలు

ఓటరు చైతన్యంపై షారుఖ్‌ వీడియో

అద్భుతమంటూ ప్రధాని ప్రశంసలు

 

ముంబయి: లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లంతా తమ ప్రజాస్వామ్యబద్ధమైన హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఓటరు చైతన్యంపై ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ ఓ ర్యాప్‌ వీడియోను విడుదల చేశారు. ‘ఇది ఓటేసే సమయం’ అనే పేరుతో రూపొందించిన 1.06 నిమిషాల నిడివి గల ఈ వీడియో పట్ల ప్రధాని మోదీ షారుఖ్‌ఖాన్‌ను అభినందించారు. అద్భుతమైన కృషి చేశారని ప్రస్తుతించారు. ఈ వీడియోలో షారుఖ్‌ స్వయంగా ‘మీ ఓటు ప్రజాస్వామ్యానికి బలాన్నిస్తుంది, పరిఢవిల్లేలా చేస్తుంది’ అని పిలుపునిచ్చారు. దీంతో తొలిసారి ఓటేయబోయే వారంతా అధిక సంఖ్యలో ముందుకొస్తారని ప్రధాని పేర్కొన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.