Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000487
            [news_title_telugu_html] => 

శ్రీనగర్‌ బయలుదేరిన విపక్ష బృందం

[news_title_telugu] => శ్రీనగర్‌ బయలుదేరిన విపక్ష బృందం [news_title_english] => Never seen such contradictions says Ghulam Nabi Azad ahead of Srinagar visit [news_short_description] => కశ్మీర్‌లో పర్యటించాలన్న విపక్షాల నిర్ణయం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కోరినా..  [news_tags_keywords] => Rahul gandhi,Srinagar,Ghulam Nabi Azad [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 12:10:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
శ్రీనగర్‌ బయలుదేరిన విపక్ష బృందం - Never seen such contradictions says Ghulam Nabi Azad ahead of Srinagar visit - EENADU
close

తాజా వార్తలు

శ్రీనగర్‌ బయలుదేరిన విపక్ష బృందం

దిల్లీ: కశ్మీర్‌లో పర్యటించాలన్న విపక్షాల నిర్ణయం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. రాహుల్‌ గాంధీతో కూడిన విపక్ష బృందం దిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘ఓవైపు కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు అక్కడ పర్యటించడానికి ఎవర్నీ అనుమతించడం లేదు. ఇంతటి విరుద్ధ ప్రకటనలు ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ పరిస్థితులన్నీ సాధారణంగానే ఉంటే రాజకీయ నాయకుల్ని ఇంకా గృహ నిర్బంధంలో ఎందుకు ఉంచారు?’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే బృందంలో సభ్యుడైన ఎన్సీపీ నేత మజీద్‌ మెమన్‌ మాట్లాడుతూ.. ‘విపక్షాల పర్యటనతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అన్న ప్రభుత్వ వాదన నిరాధారం’ అని వ్యాఖ్యానించారు.   

లోయలో శాంతి భద్రతల పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ సీనియర్ నాయకులు ఇక్కడ పర్యటించే ప్రయత్నం చెయ్యొద్దని అధికారులు కోరిన విషయం తెలిసిందే. అలాగే అనేక ప్రాంతాల్లో ఇంకా నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తాజా పర్యటన.. నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని ప్రకటించింది. శాంతి, భద్రతల పునరుద్ధరణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యటనను రద్దు చేసుకోవాలని అధికారులు కోరారు. సీమాంతర ఉగ్రవాదం నుంచి ప్రజల్ని కాపాడడానికి తీసుకుంటున్న చర్యలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.