close
గుంటూరు ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనం

వాషింగ్టన్‌: అమెరికాలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమ్మేళనం వాషింగ్టన్‌ డీసీలోని వాల్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు ఎన్నారై అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు శ్రీనివాసరావు కొమ్మినేని, మురళి వెన్నం, రాం చౌదరి ఉప్పుటూరి సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి మధు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడికి చెందిన ప్రసాద్ పాండా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రసాద్ మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. గుంటూరు వాసులు ప్రపంచంలో ఎక్కడున్నా సొంత ఊరు, మాతృదేశం అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ ప్రముఖులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవసుబ్బారావు, శుకవాసి శ్రీనివాస్, తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్, జయరామ్ కోమటి, హేమ ప్రసాద్, ప్రస్తుత తానా అధ్యక్షుడు జయశంకర్ తాళ్లూరి, మిమిక్రీ రమేష్ హాజరయ్యారు. శ్రీనివాసరావు కొమ్మినేని, మురళి వెన్నం, రాంచౌదరి ఉప్పుటూరి, ఫణి బాబు ఉప్పల, చలపతి కొండ్రగుంట, బుల్లయ్య ఉన్నవ, చిన్నపురెడ్డి అల్లం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని