ఈటల చేసిందేమీ లేదు

ప్రధానాంశాలు

ఈటల చేసిందేమీ లేదు

గెల్లును గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత నాది
జమ్మికుంట ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌ : ఆరుసార్లు గెలిచిన ఈటల రాజేందర్‌  హుజూరాబాద్‌ ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తరఫున ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూరాబాద్‌లో భాజపా గెలవదన్నారు. ఒక వేళ గెలిచినా.. ఈటల రాజేందర్‌ మంత్రి అయ్యేదుందా..? అభివృద్ధి చేసేదుందా..? అని ప్రశ్నించారు. గెల్లు శ్రీనివాస్‌ గెలిస్తేనే తాను అధికారులతో ఇక్కడికి వచ్చి అన్ని రకాల అభివృద్ధిని అందిస్తానన్నారు. మొసలి కన్నీరు కారుస్తూ.. నాలుగు డైలాగులు కొడితే ప్రజల కడుపు నిండదని, అసలు ప్రజలకు భాజపా ఏం చేస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజల్ని రెచ్చగొట్టేందుకే ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. తాము వాళ్ల మాదిరిగా ఉపన్యాసాలివ్వట్లేదని.. చేసిన పనిని చెబుతూ.. చెయ్యాల్సిన పనులపై దృష్టి పెడుతున్నామన్నారు. రాజేందర్‌ భాజపాలో ఉంటారని అనిపించడం లేదని.. కనీసం భారత్‌మాతాకీ జై, మోదీకి జై అని అనడంలేదని ఆ పార్టీ వాళ్లే మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని