Virat Kohli - Anderson: జిమ్మీ దూకుడు నచ్చినా.. అతడి భాష మాత్రం..!

తాజా వార్తలు

Published : 17/08/2021 01:40 IST

Virat Kohli - Anderson: జిమ్మీ దూకుడు నచ్చినా.. అతడి భాష మాత్రం..!

లండన్‌: విరాట్‌ కోహ్లీ, అండర్సన్‌ మాటల యుద్ధంపై ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ స్పందించాడు. జిమ్మీ దూకుడు నచ్చినా అతడు ఉపయోగించిన భాష మాత్రం చిక్కుల్లో పడేస్తుందని అన్నాడు. తాజా ఉదంతంపై అతడు ట్వీట్‌ చేశాడు.

మూడో రోజు ఇంగ్లాండ్‌ ఆలౌటైనప్పటి నుంచి ఈ ఘటన మొదలైంది. ఇంగ్లాండ్‌లో 11వ స్థానంలో అండర్సన్‌ బ్యాటింగ్‌ చేశాడు. అప్పుడు జస్ప్రీత్‌ బుమ్రా వరుస బౌన్సర్లతో అతడిని ఇబ్బంది పెట్టాడు. అతడిని ఔట్‌ చేయగానే బుమ్రాను దుర్భాషలాడుతూ జిమ్మీ పెవిలియన్‌కు వెళ్లాడు.

ఇదే విషయాన్ని టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ ఆడేటప్పుడు విరాట్‌ కోహ్లీ బయటపెట్టాడు. జేమ్స్‌ అండర్సన్‌ పుజారాకు బౌలింగ్‌ చేసేటప్పుడు అతడికి ఘాటుగా బదులిచ్చాడు. ‘బుమ్రాను తిట్టినట్లే నువ్వు నన్నూ తిడుతున్నావా? (ఓ బూతు మాట వాడుతూ) ఇదేమీ నీ సొంత అడ్డా కాదు’ అని కోహ్లీ కోపంగా అండర్సన్‌ను చూస్తూ అనడం స్టంప్‌ మైక్రోఫోన్లో వినిపించింది. అండర్సన్‌ ఏదో అన్నాడు కానీ.. అది వినిపించలేదు. కోహ్లీ స్పందిస్తూ.. ‘వయసు పెరగడం వల్లే నువ్విలా ప్రవరిస్తున్నావు’ అని అన్నాడు.

‘ఇది నీ అడ్డా కాదు’ అన్న మాటలపై స్టువర్ట్‌ బ్రాడ్‌ స్పందించాడు. ‘జిమ్మీ సొంత గడ్డలాగే ఇదీ అతడికి దగ్గరైన అడ్డా అని లార్డ్స్ ఆనర్స్‌ బోర్డు చెబుతోంది! అతడి దూకుడు నాకు నచ్చింది. కానీ అతడు ఉపయోగించిన భాష మాత్రం చిక్కుల్లో పడేయొచ్చు..’ అని బ్రాడ్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ, అండర్సన్‌ మాటల యుద్ధం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని