ఫొటోగ్రఫీ కోర్సులు ఎక్కడ?

డిగ్రీ వరకూ చదివాను. నాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఏ యూనివర్సిటీల్లో ఈ కోర్సులున్నాయి?

Updated : 30 Nov 2022 08:56 IST

డిగ్రీ వరకూ చదివాను. నాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఏ యూనివర్సిటీల్లో ఈ కోర్సులున్నాయి?

- టి.మహేష్‌

దేశవ్యాప్తంగా ఫొటోగ్రఫీలో డిగ్రీ, పీజీ కోర్సులు అతితక్కువ కాలేజీల్లో ఉన్నాయి. ఫొటోగ్రఫీని బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) డిగ్రీగా చదివే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఫొటోగ్రఫీ కోర్సు జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేెఎన్‌ఏఎఫ్‌ఏయూ) హైదరాబాద్‌, శ్రీ వేంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. జేెఎన్‌ఏఎఫ్‌ఏయూ నాలుగేళ్ల బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌), రెండు సంవత్సరాల మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోగ్రఫీ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌) కోర్సులను అందిస్తోంది. జేెఎన్‌ఏఎఫ్‌ఏయూ బీఎఫ్‌ఏ కోర్సులో ఫొటోగ్రఫీ యాజ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ, ఫోటో జర్నలిజం, ఆడియో విజువల్‌ కమ్యూనికేషన్‌, డిజిటల్‌ ఫొటోగ్రఫీ, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, మల్టీమీడియా, ప్రొఫెషనల్‌ వీడియోగ్రఫీ లాంటి సబ్జెక్టులుంటాయి.

శ్రీ వేంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో మూడేళ్ల వ్యవధితో బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ అండ్‌ డిజిటల్‌ ఆర్ట్‌) కోర్సు ఉంది. ఫొటోగ్రఫీ చదివినవారికి ఈకామర్స్‌ సంస్థలు, న్యూస్‌ ఏజెన్సీలు, స్టూడియోలు, మ్యాగజైన్‌లు, అడ్వర్టైజింగ్‌, పరిశోధన సంస్థల్లో అవకాశాలుంటాయి. ఇంకా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్షన్‌, ఆర్కిటెక్చర్‌ సంస్థలు, టూరిజం, క్రీడా శిక్షణ సంస్థలు, ఫుడ్‌ ఇండస్ట్రీలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఫొటోగ్రఫీ పీజీలో రకరకాల స్పెషలైజేషన్లు కూడా ఉంటాయి. మీకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ ఎంచుకొని, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని