అవకాశాలు చేజారిపోతున్నాయి...

మూడు ఎంఎన్‌సీ కంపెనీల్లో పనిచేశాను. ఫైనాన్స్‌, అకౌంట్స్‌ విభాగంలో మూడున్నరేళ్ల అనుభవం ఉంది. శాప్‌ ఈఆర్‌పీ, శాప్‌ ఫికొ కోర్సుల్లో శిక్షణ పొందాను.

Published : 25 May 2023 00:26 IST

మూడు ఎంఎన్‌సీ కంపెనీల్లో పనిచేశాను. ఫైనాన్స్‌, అకౌంట్స్‌ విభాగంలో మూడున్నరేళ్ల అనుభవం ఉంది. శాప్‌ ఈఆర్‌పీ, శాప్‌ ఫికొ కోర్సుల్లో శిక్షణ పొందాను. మూడో కంపెనీలో కాంట్రాక్టు పీరియడ్‌ ముగిశాక ఏడు నెలలుగా ఖాళీగా ఉన్నాను. కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి. త్వరగా ఉద్యోగం రావాలంటే నేనేం చేయాలి?  
సురేందర్‌

*ఉద్యోగానుభవం, శిక్షణ పొందిన కోర్సుల గురించి రాశారు కానీ, మీ విద్యార్హతలు తెలియచేయలేదు. బీటెక్‌/ బీకామ్‌/ బీబీఏ/ ఎంకామ్‌/ ఎంబీఏ చేశారా, సిఏ/ ఐసీడబ్ల్యూఏ/ కంపెనీ సెక్రటరీ లాంటి కోర్సులు ఏమైనా చదివారా అనే వివరాలు చెప్పలేదు. ఫైనాన్స్‌/ అకౌంటింగ్‌ విభాగాల్లో ఏ హోదాలో పనిచేశారో కూడా రాయలేదు. ముందుగా మీరు ఏ రంగంలో, ఎలాంటి ఉద్యోగంలో స్థిరపడాలనుకొంటున్నారో నిర్ణయించుకోండి. అందుకు తగ్గ కోర్సులు, శిక్షణ పొందే ప్రయత్నం చేయండి. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నాయని చెప్పారు. ఏ కారణాలవల్ల ఉద్యోగం రావట్లేదో తెలుసుకొనే ప్రయత్నం చేయండి. విషయ పరిజ్ఞానం తక్కువగా ఉండటం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేకపోవడం, మీ గత ఉద్యోగాల్లో చేసిన పని వివరాల గురించి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోవడం, మూడేళ్లలో మూడు కంపెనీలు మారడం, మీరు ప్రయత్నిస్తున్న ఉద్యోగానికి కావలసిన నైపుణ్యాలు మీ దగ్గర లేవని ఇంటర్వ్యూ చేసేవారు భావించడం, మీ బాడీ లాంగ్వేజ్‌ సరిగా లేకపోవడం..వీటిలో ఏయే కారణాలవల్ల మీరు ఉద్యోగాన్ని పొందలేకపోతున్నారో తెలుసుకోండి. ఆ దిశలో మిమ్మల్ని మీరు మెరుగుపర్చుకొనే ప్రయత్నాలు చేయండి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని