అర్బన్‌ ప్లానింగ్‌ కోర్సులు ఎక్కడ?

టౌన్‌ ప్లానింగ్‌లో పీజీ గానీ, డిప్లొమా కోర్సు గానీ కరస్పాండెన్స్‌  పద్ధతిలో ఏ యూనివర్సిటీలు అందిస్తున్నాయి?

Published : 05 Mar 2024 00:12 IST

టౌన్‌ ప్లానింగ్‌లో పీజీ గానీ, డిప్లొమా కోర్సు గానీ కరస్పాండెన్స్‌  పద్ధతిలో ఏ యూనివర్సిటీలు అందిస్తున్నాయి?

హరికృష్ణ

టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్ని రెగ్యులర్‌ పద్ధ్దతిలో చదివితేనే వృత్తి నైపుణ్యాలు మెరుగవుతాయి. ఒకవేళ, మీరు ప్రస్తుతం అదే రంగంలో పనిచేస్తూ, విద్యార్హతలు పెంచుకోవాలనుకొంటే కరస్పాండెన్స్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌/ ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ పీజీ కోర్సులు ఉపయోగపడతాయి. సాధారణంగా టౌన్‌ ప్లానింగ్‌లో పీజీ కోర్సులను ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలు బీఆర్క్‌ చదివినవారికి మాత్రమే రెగ్యులర్‌ పద్దతిలో అందిస్తున్నాయి. అతికొద్ది విద్యాసంస్థలు మాత్రమే టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) పీజీ డిప్లొమా ఇన్‌ అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంని  అందిస్తోంది. స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, దిల్లీ.. సిటీ అండ్‌ మెట్రోపాలిటన్‌ ప్లానింగ్‌నూ, ఐఐటీ ఖరగ్‌పూర్‌.. అర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్స్‌లో, ఐఐటీ రూర్కీ.. ఇంట్రడక్షన్‌ టు సర్వీసెస్‌ ప్లానింగ్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులను ‘స్వయం’ పోర్టల్‌ ద్వారా అందిస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని ప్రైవేటు/ విదేశీ యూనివర్సిటీలు కూడా టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌లో ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత పూర్తిగా తెలుసుకొని ప్రవేశం విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ది గ్లోబల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, నాగాలాండ్‌లో అర్బన్‌ ప్లానింగ్‌లో ఎమ్మెస్సీ ప్రోగ్రాం దూరవిద్య ద్వారా అందుబాటులో ఉంది.  

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు