అదనపు సబ్జెక్టు చదివే వీలుందా?

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి 2020లో బీఎస్సీ (బోటనీ, జువాలజీ, తెలుగు) పూర్తిచేశాను. డిగ్రీ సమయంలో కెమిస్ట్రీకి బదులుగా తెలుగు సబ్జెక్టు తీసుకున్నాను. ఇప్పుడు డిగ్రీకి కెమిస్ట్రీ సబ్జెక్టును యాడ్‌ చేసుకోవాలని అనుకుంటున్నాను. అలా చేయడానికి వీలుంటుందా?

Published : 11 Mar 2024 00:46 IST

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి 2020లో బీఎస్సీ (బోటనీ, జువాలజీ, తెలుగు) పూర్తిచేశాను. డిగ్రీ సమయంలో కెమిస్ట్రీకి బదులుగా తెలుగు సబ్జెక్టు తీసుకున్నాను. ఇప్పుడు డిగ్రీకి కెమిస్ట్రీ సబ్జెక్టును యాడ్‌ చేసుకోవాలని అనుకుంటున్నాను. అలా చేయడానికి వీలుంటుందా?

ఎస్‌.పవన్‌

మీరు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్‌ ఏ సంవత్సరంలో తీసుకున్నారో చెప్పలేదు. డీఆర్‌ బీఆర్‌ఏఓయూలో 2017 నుంచి సీబీసీఎస్‌ (చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం)ను ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో డిగ్రీ పూర్తయ్యాక, అదనపు కోర్సును చదివే వెసులుబాటు లేదు. 2017కి ముందు అడ్మిషన్‌ తీసుకొన్నవారికి ఈ వెసులుబాటు ఉండేది. సీబీసీఎస్‌ పథకం మొదలై దాదాపు ఏడు సంవత్సరాలు అయింది కాబట్టి, ప్రస్తుతం అదనపు సబ్జెక్టు చదివే అవకాశం లేదు. ఏదైనా ప్రైవేటు యూనివర్సిటీని  సంప్రదించి ఇలాంటి వెసులుబాటు ఇస్తారేమో కనుక్కోండి. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక, కల్పించే వెసులుబాట్లు పాత విద్యార్థులకు వర్తింపచేస్తారా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేము. మరింత సమాచారం కోసం డీఆర్‌ బీఆర్‌ఏఓయూలో స్టూడెంట్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ను సంప్రదించండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని