ఇప్పుడు పూర్తిచేస్తే... డిగ్రీ చెల్లుతుందా?

బీటెక్‌ (2009-2013) చదివాను. కొన్ని సబ్జెక్టులు మిగిలాయి. కాలేజికి వెళ్తే మిగిలిన సబ్జెక్టులు పూర్తిచేసుకోమని అనుమతి ఇచ్చారు.

Published : 19 Mar 2024 00:07 IST

బీటెక్‌ (2009-2013) చదివాను. కొన్ని సబ్జెక్టులు మిగిలాయి. కాలేజికి వెళ్తే మిగిలిన సబ్జెక్టులు పూర్తిచేసుకోమని అనుమతి ఇచ్చారు. ఇప్పుడు అవి పాసైతే.. ఆ డిగ్రీ చెల్లుబాటవుతుందా?

ప్రవీణ్‌ కుమార్‌

మీరు 13 నుంచి ఈ పది సంవత్సరాల్లో ఏం చేశారో, ఇంజినీరింగ్‌లో ఎన్ని సబ్జెక్టులు మిగిలాయో చెప్పలేదు. కళాశాల వారు మిమ్మల్ని మిగిలిన సబ్జెక్టులు పూర్తి చేసుకోవడానికి అనుమతించారంటే... ఆ కళాశాల అనుబంధ యూనివర్సిటీ నిబంధనలకు లోబడే చెప్పివుండాలి. ఆ విషయాన్ని మీ అనుబంధ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి నుంచి ధ్రువీకరించుకోండి. కొన్ని సందర్భాల్లో యూనివర్సిటీలు సబ్జెక్టులు మిగిలిపోయి డిగ్రీ పూర్తి చేయలేకపోయిన వారికి ఒక్క చివరి అవకాశంగా ప్రత్యేక వెసులుబాటును కల్పించి, పరీక్షలు రాసే అవకాశాన్ని ఇస్తూ ఉంటాయి. బహుశా, మీ యూనివర్సిటీ కూడా అలా చేసి ఉండొచ్చు.

మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంజినీరింగ్‌ పూర్తిచేసే ప్రయత్నం చేయండి. చివరిగా - ఏదైనా యూనివర్సిటీ, యూజీసీ నిబంధనలకు లోబడి ఇచ్చిన డిగ్రీ చెల్లుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగావకాశాలు చదివిన డిగ్రీతో మాత్రమే కాకుండా.. మీ విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలపై కూడా ఆధారపడి ఉంటాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని