ఏ కోర్సులతో ఐటీ ప్రవేశం?

బీకాం తర్వాత సీఏ ఇంటర్‌ పూర్తిచేశాను. సీఏ ఫైనల్‌ క్లియర్‌ చేయలేకపోయా. 2014 నుంచీ క్లియరింగ్‌ అండ్‌ ఫార్వర్డింగ్‌ ఏజెంట్‌ దగ్గర అకౌంటెంట్‌గా పనిచేస్తున్నా.

Published : 20 Mar 2024 00:10 IST

బీకాం తర్వాత సీఏ ఇంటర్‌ పూర్తిచేశాను. సీఏ ఫైనల్‌ క్లియర్‌ చేయలేకపోయా. 2014 నుంచీ క్లియరింగ్‌ అండ్‌ ఫార్వర్డింగ్‌ ఏజెంట్‌ దగ్గర అకౌంటెంట్‌గా పనిచేస్తున్నా. ఇప్పుడు ఐటీ వైపు వెళ్లాలంటే ఏ కోర్సులు చేయాలి?

మెహరాజ్‌ షేక్‌

కౌంటింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో సాంకేతికత వేగంగా పెరుగుతున్న ఈ తరుణంలో అకౌంటింగ్‌ నుంచి ఐటీ రంగానికి మారడం పెద్ద కష్టం కాదు. మైక్రోసాఫ్ట్‌ పవర్‌ బీఐ, ట్యాబ్లూ వంటి సాప్ట్‌వేర్‌లను నేర్చుకోవడం ద్వారా మీ నైపుణ్యాలనూ, తద్వారా ఉద్యోగ అవకాశాలనూ మెరుగుపర్చుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ పవర్‌ బీఐ, ట్యాబ్లూల్లో సర్టిఫికెట్‌ పొందితే, ఐటీ రంగంలో మొదటి ఉద్యోగాన్ని పొందడం సులువు. వీటితో పాటు మైక్రోసాప్ట్‌ ఎక్సెల్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌, పైతాన్‌ ప్రోగ్రామింగ్‌లపై కూడా మంచి పట్టు సాధించాలి. ఒకవేళ పీజీ కోర్సు చేయాలనుకుంటే ఎంకాం (కంప్యూటర్స్‌) గురించి ఆలోచించవచ్చు. మేనేజ్‌మెంట్‌, డేటా సైన్స్‌ రంగాలపై ఆసక్తి ఉంటే, ఎంబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌) చదివితే ఉపయోగకరం. ఈ పీజీతో ఫైనాన్షియల్‌ అనలిటిక్స్‌ రంగంలోకి కూడా వెళ్ళవచ్చు. ఇటీవలి కాలంలో కంప్యూటింగ్‌, డేటా అనలిటిక్స్‌ రంగాల్లో నైపుణ్యాలున్న వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా కాకుండా మీ క్లియరింగ్‌ అండ్‌ ఫార్వర్డింగ్‌ ఉద్యోగానుభవాన్ని ఉపయోగించి మంచి ఉద్యోగం పొందాలంటే బ్లాక్‌ చెయిన్‌/ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా చదివే ప్రయత్నం చేస్తే మేలు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని