గేమింగ్‌ కోర్సుల్లో చేరాలంటే...

మా అబ్బాయి ఇంటర్‌ (ఎంపీసీ) రెండో ఏడాది పరీక్షలు రాశాడు. ఎంసెట్‌ రాసే ఆలోచన లేదు. వీడియో గేమ్స్‌ అంటే చాలా ఇష్టం. వీడియో గేమ్స్‌ లేదా యానిమేషన్‌ సంబంధిత కోర్సులు  ఎక్కడ ఉన్నాయి?

Published : 25 Mar 2024 00:07 IST

మా అబ్బాయి ఇంటర్‌ (ఎంపీసీ) రెండో ఏడాది పరీక్షలు రాశాడు. ఎంసెట్‌ రాసే ఆలోచన లేదు. వీడియో గేమ్స్‌ అంటే చాలా ఇష్టం. వీడియో గేమ్స్‌ లేదా యానిమేషన్‌ సంబంధిత కోర్సులు  ఎక్కడ ఉన్నాయి?

శ్రీలక్ష్మి                      

  • వీడియో గేమ్స్‌ అంటే ఇష్టం వేరు, వాటికి సంబంధించిన కోర్సులు చదవడం వేరు. చాలా సందర్భాల్లో ఒక వయసు వచ్చాక పిల్లల్లో వీడియో గేమ్స్‌ మీద ఆసక్తి తగ్గి, అందుకు సంబంధించిన కోర్సులపై ఇష్టం తగ్గే ప్రమాదం ఉంది. మీ అబ్బాయిని వీడియో గేమ్స్‌/ యానిమేషన్‌ లాంటి కోర్సుల్లో చేర్పించేముందు, ఆ రంగంలో రాణించాలంటే ఎంత ఓపిక ఉండాలో, ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాలో, ఎలాంటి నైపుణ్యాలు అవసరమో చెప్పే ప్రయత్నం చేయండి. యానిమేషన్‌ రంగంలో ప్రవేశించాలంటే డ్రాయింగ్‌పై ఆసక్తి, టెక్నాలజీపై కొంత  అవగాహన, సృజనాత్మకత అవసరం. ఇలాంటి కోర్సుల్లో డ్రాయింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, వీడియో గేమ్‌లను ఎలా తయారుచేయాలో నేర్పుతారు. యానిమేషన్‌కు సంబంధించిన ప్రోగ్రాంలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌- అహ్మదాబాద్‌, ఐడీసీ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ ఐఐటీ- బాంబే, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌- కోల్‌కతా, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, అమిటీ యూనివర్సిటీ, పీఏ ఇనాందార్‌ కాలేజ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌, డిజైన్‌ అండ్‌ ఆర్ట్‌- పుణె,   ఇండియన్‌ ఇన్‌స్ట్టిస్టూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ యానిమేషన్‌- బెంగళూరు, ఆసియన్‌  అకాడెమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌- నోయిడా, ఎంఐటీ యూనివర్సిటీ ఆఫ్‌ డిజైన్‌- పుణె, సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌- కోల్‌కతా అందిస్తున్నాయి. వీడియో గేమింగ్‌కు సంబంధించిన కోర్సులు చాలా ప్రైవేటు సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి. సంస్థల విశ్వసనీయత పూర్తిగా తెలుసుకుని మంచి శిక్షణ సంస్థను ఎంచుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని