ఎటూ తేల్చుకోలేకపోతున్నా..

బీఏ, బీఎల్‌ చేశాను. ‘ప్రాక్టీస్‌ చేస్తే నిలదొక్కుకోవడానికి సమయం పడుతుంది. ఉద్యోగంలో చేరమంటున్నారు స్నేహితులు. నాకేమో ప్రాక్టీస్‌ చేయాలనుంది.

Published : 26 Mar 2024 00:02 IST

బీఏ, బీఎల్‌ చేశాను. ‘ప్రాక్టీస్‌ చేస్తే నిలదొక్కుకోవడానికి సమయం పడుతుంది. ఉద్యోగంలో చేరమంటున్నారు స్నేహితులు. నాకేమో ప్రాక్టీస్‌ చేయాలనుంది. ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. ఎటూ తేల్చుకోలేకపోతున్నా.

డి.రామకృష్ణ

స్నేహితులు, కౌన్సెలర్లు సలహాలు మాత్రమే ఇవ్వగలరు. చివరి నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ముందుగా సీనియర్‌ లాయర్‌ దగ్గర కొంతకాలం జూనియర్‌గా పనిచేసి, వృత్తి నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. తర్వాత ప్రాక్టీస్‌ పెట్టాలి. సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టాక, కొంతకాలం వరకు కేసులు ఎక్కువగా రాకపోవచ్చు. లాయర్ల సంఖ్య అధికంగా ఉండటం వల్ల పోటీ కూడా ఎక్కువగానే ఉంది. మీరు లాయర్‌గా స్థిరపడటానికి చాలా సమయం కూడా పట్టవచ్చు. ఉద్యోగం చేస్తే స్థిరమైన ఆదాయం ఉండొచ్చు కానీ, ఉద్యోగం రావడానికి ఎక్కువ సమయం అవసరం అవ్వొచ్చు. మీ దృష్టిలో ఉద్యోగం అంటే న్యాయవ్యవస్థకు సంబంధించిన ఉద్యోగమా, ఇతర ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగమా అనేది చెప్పలేదు. ప్రాక్టీస్‌ చేయడమా, ఉద్యోగం చేయడమా అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. జీవితంలో ఆర్థిక స్థాయితో పాటు మనసుకు నచ్చిన పని చేయడం కూడా ముఖ్యం. లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయాలన్న బలమైన కోరిక ఉంటే, అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. కెరియర్‌లో రిస్క్‌ తీసుకోవడం, ఉద్యోగ భద్రత, పరిమిత జీతం, అపరిమితమైన పేరు ప్రఖ్యాతులు, మెరుగైన ఆదాయం లాంటి వాటిని పరిగణనలోకి తీసుకొని నచ్చిన నిర్ణయం దిశగా అడుగులేయండి.     

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని