ఎంఏ ఎడ్యుకేషన్‌ చేశాక..

ఎంఏ ఎడ్యుకేషన్‌ చదివినవారికి గతంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత ఉండేది. కాలక్రమేణా  డీఈడీ, బీఈడీ చేసినవారికి మాత్రమే ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత కల్పించారు.

Published : 27 Mar 2024 00:28 IST

ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) నుంచి ఎంఏ (ఎడ్యుకేషన్‌) పూర్తిచేశాను. దీంతో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

రమేష్‌ బండారి

ఎంఏ ఎడ్యుకేషన్‌ చదివినవారికి గతంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత ఉండేది. కాలక్రమేణా  డీఈడీ, బీఈడీ చేసినవారికి మాత్రమే ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత కల్పించారు. ఒడిశా లాంటి కొన్ని రాష్ట్రాల్లో డిగ్రీ స్థాయిలో హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో పాటు ఎడ్యుకేషన్‌ను కూడా ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. అలాంటి కళాశాలల్లో ఎంఏ ఎడ్యుకేషన్‌తో పాటు నెట్‌/ సెట్‌/ పీహెచ్‌డీ అర్హతతో డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ స్థాయిలో ఎడ్యుకేషన్‌ కోర్సు అందుబాటులో లేదు. మీకు ఎంఏ ఎడ్యుకేషన్‌తో పాటు, మరో సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ, ఎడ్యుకేషన్‌లో నెట్‌/ సెట్‌ ఉత్తీర్ణత సాధిస్తే, ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో అధ్యాపక ఉద్యోగాలకు అర్హులు అవుతారు.

ఎంఏ ఎడ్యుకేషన్‌ చదివినవారికి ప్రత్యేకమైన ఉద్యోగావకాశాలు లేవు. దీన్ని మరో పీజీ సబ్జెక్టుగా మాత్రమే పరిగణించి, ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. విద్యా రంగానికి సంబంధించిన స్వచ్ఛంద సేవాసంస్థల్లో కొలువుల కోసం ప్రయత్నించవచ్చు. ఎడ్యుకేషన్‌ టెక్నాలజీలో అదనపు కోర్సులు చేసి ఎడ్యుటెక్‌ కంపెనీల్లోనూ, సైకాలజీలో అదనపు కోర్సులు చేసి విద్యాసంస్థల్లోనూ కౌన్సెలర్‌గా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని