ఏ కోర్సులు చేయాలి?

ఇంటర్‌ పరీక్షలు రాశాను. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ జనరల్‌ ఎడ్యుకేషన్‌లో బోధనకు ఏ కోర్సులు చేయాలి?

Published : 01 Apr 2024 00:15 IST

ఇంటర్‌ పరీక్షలు రాశాను. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ జనరల్‌ ఎడ్యుకేషన్‌లో బోధనకు ఏ కోర్సులు చేయాలి?

గణేష్‌ సాయికుమార్‌

ఇంటర్మీడియట్‌ తరువాత బోధన రంగానికి సంబంధించిన శిక్షణ పొందాలంటే మీకు రెండు మార్గాలున్నాయి. మొదటిది రెండేళ్ల వ్యవధి ఉన్న డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌. రెండోది- రెండేళ్ల వ్యవధి ఉన్న డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ గుర్తింపు తప్పనిసరి. ఈ ప్రోగ్రాంలో ప్రవేశానికి డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో మెరుగైన ర్యాంకు పొంది, ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశం పొందవచ్చు. డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంకు నేషనల్‌ రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు అవసరం. ఈ ప్రోగ్రాంలో ప్రవేశం కోసం ఆలిండియా ఆన్‌లైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో ర్యాంకు పొంది జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ఉన్న వివిధ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో దరఖాస్తు చేయాలి. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో ఇంటలెక్చువల్‌ అండ్‌ డెవలప్‌మెంటల్‌ డిసెబిలిటీస్‌, విజువల్‌ - హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌.. విభాగాలుంటాయి. వీటిలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని