రిటైల్‌ మార్కెటింగ్‌లో డిప్లొమా చేయాలని..

డిస్టెన్స్‌లో ఎంఏ (ఇంగ్లిష్‌) పూర్తిచేసి.. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా ఎదుగుదల లేదు. ఇప్పుడు కాకతీయ వర్సిటీ ఎస్‌డీఎల్‌సీఈలో ‘డిప్లొమా ఇన్‌ రిటైల్‌ మార్కెటింగ్‌’ చేద్దామనుకుంటున్నా.

Published : 23 Apr 2024 00:36 IST

డిస్టెన్స్‌లో ఎంఏ (ఇంగ్లిష్‌) పూర్తిచేసి.. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా ఎదుగుదల లేదు. ఇప్పుడు కాకతీయ వర్సిటీ ఎస్‌డీఎల్‌సీఈలో ‘డిప్లొమా ఇన్‌ రిటైల్‌ మార్కెటింగ్‌’ చేద్దామనుకుంటున్నా. ఉపయోగమేనా?

వి.సురేష్‌, వరంగల్‌  

  • మీరు ప్రస్తుతం ఏం ఉద్యోగం చేస్తున్నారో చెప్పలేదు. రిటైల్‌ మార్కెటింగ్‌లో డిప్లొమా ఎందుకు చేయాలనుకుంటున్నారు? డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రాంలు.. ఆ రంగంలో అప్పటికే ఉద్యోగం చేస్తున్నవారి పదోన్నతికి ఉపయోగపడతాయి కానీ, కొత్తగా ఉద్యోగం పొందటానికి కాదు. మీ ప్రస్తుత వయసును బట్టి కూడా నిర్ణయించుకోవాలి. మీకు రిటైలింగ్‌ రంగంపై నిజమైన ఆసక్తి ఉందా? ఆ రంగంలో ఉద్యోగాలు ఎక్కువని ఆ వైపు వెళ్లాలనుకొంటున్నారా? మీకు రిటైలింగ్‌పై ఆసక్తి ఉంటే, ముందుగా ఆన్‌లైన్‌లో సంబంధిత కోర్సులు కొన్ని చేసి ఆ రంగంలోని ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పర్చుకోండి. ఆ తరువాత ఏదైనా ప్రముఖ రిటైలింగ్‌ సంస్థలో ఓ చిన్న ఉద్యోగంలో చేరి కొంత అనుభవం, నైపుణ్యాలు గడించండి. మీకు ఆ రంగంలో ఉద్యోగం నచ్చితే రిటైలింగ్‌లో ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌ విధానంలో, అత్యుత్తమ విద్యా సంస్థల నుంచి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని