ఎటూ తేల్చుకోలేకపోతున్నా..

బీటెక్‌ (2013) డిస్‌కంటిన్యూ చేసి.. ప్రభుత్వఉద్యోగాలకు సన్నద్ధమైనా సాధించలేదు. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఐదున్నరేళ్లుగా పనిచేస్తున్నా.

Updated : 25 Apr 2024 01:10 IST

బీటెక్‌ (2013) డిస్‌కంటిన్యూ చేసి.. ప్రభుత్వఉద్యోగాలకు సన్నద్ధమైనా సాధించలేదు. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఐదున్నరేళ్లుగా పనిచేస్తున్నా. ఇప్పుడేదైనా కోర్సు నేర్చుకుని  సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయాలనుంది. అలాగే ఎంబీఏ చదవాలా, చేస్తోన్న ఉద్యోగంలో కొనసాగాలా.. తేల్చుకోలేకపోతున్నా.

డి.శ్రీకాంత్‌

మీరు 2013లో బీటెక్‌ డిస్‌కంటిన్యూ చేశారంటే, మీ వయసు దాదాపుగా 30 ఉండొచ్చు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఆ రంగంలో స్థిరపడితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు బీటెక్‌లో ఏ బ్రాంచిలో చేరారు అన్న విషయాన్ని చెప్పలేదు. మీరు డిగ్రీ పూర్తి చేయలేదు కాబట్టి ఎంబీఏ చదవడానికి అర్హత లేదు. బీఏ/బీకాం/బీబీఏల్లో మీకు నచ్చిన డిగ్రీని ఆన్‌లైన్‌/ దూరవిద్య ద్వారా పూర్తి చేయండి. ఆ తరువాత ఎంబీఏ- మార్కెటింగ్‌ కానీ, ఎంబీఏ- రియల్‌ ఎస్టేట్‌ కానీ చదివే ప్రయత్నం చేయండి. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయాలన్నా కనీసం డిగ్రీ విద్యార్హత అవసరం. మీ రియల్‌ ఎస్టేట్‌ ఉద్యోగానుభవం, సాఫ్ట్‌వేర్‌ రంగంతో సంబంధం లేకపోవడం, ఇంటర్‌కూ, పూర్తి చేయబోయే డిగ్రీకీ మధ్య అధిక వ్యవధి.. ఈ కారణాలతో సాఫ్ట్‌వేర్‌ రంగంలో మంచి ఉద్యోగం పొందడం కొంత కష్టమే. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కొనసాగిస్తూనే డిగ్రీ/ఎంబీఏ పూర్తిచేసి, రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే మెరుగైన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని