మంచి కెరియర్‌ కావాలంటే...

టీటీసీ (2022) పూర్తిచేసి డీఎస్‌సీ ప్రకటించలేదని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో బీటెక్‌లో (2023) చేరాను. ఒక సెమిస్టర్‌ పూర్తయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చింది. రెండో సెమిస్టర్‌కు ఫీజు కట్టలేదు.

Published : 29 Apr 2024 00:05 IST

టీటీసీ (2022) పూర్తిచేసి డీఎస్‌సీ ప్రకటించలేదని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో బీటెక్‌లో (2023) చేరాను. ఒక సెమిస్టర్‌ పూర్తయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చింది. రెండో సెమిస్టర్‌కు ఫీజు కట్టలేదు. ఇప్పుడు రెండో ఏడాది కొనసాగించవచ్చా?

 కె.కార్తీక్‌

డీఎస్సీ నోటిఫికేషన్‌ రాలేదని బీటెక్‌ చదవడం, బీటెక్‌తో ఉద్యోగం రాలేదని బీఈడీ చేయడం, టీచర్‌ ఉద్యోగం రాలేదని ఎంటెక్‌ చేయడం.. ఇవన్నీ మీకు మంచి కెరియర్‌ని ఇవ్వవు. మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంది? ఏ ఉద్యోగం చేస్తే మానసిక/ ఉద్యోగ సంతృప్తి ఉంటుంది? మీకు ఏ రంగంలో నైపుణ్యాలు ఉన్నాయి? మీ దీర్ఘకాలిక/ స్వల్పకాలిక ఆశయాలు ఏమిటి? వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

మీ ప్రశ్నకొస్తే- మీరు రెండో సెమిస్టర్‌కు ఫీజు కట్టలేదు కాబట్టి, రెండో సెమిస్టర్‌ చదవలేరు. రెండో సెమిస్టర్‌ చదవకుండా మూడో సెమిస్టర్‌/ రెండో సంవత్సరం చదవడం కుదరదు. మీరు బీటెక్‌ మొదటి సంవత్సరంలో ఎన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు అయ్యారనేది రెండో సెమిస్టర్‌లోకి ప్రమోట్‌ అవుతారా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. మీరు మొదటి సెమిస్టర్‌ మళ్ళీ చదవాలా? నేరుగా వచ్చే సంవత్సరం మీ జూనియర్స్‌తో రెండో సెమిస్టర్‌లోకి ప్రవేశం పొందవచ్చా? అనేది అడ్మిషన్‌ తీసుకొన్న యూనివర్సిటీ నిబంధనలకు లోబడి ఉంటుంది. యూనివర్సిటీ అధికారులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని