ఏ కోర్సులు మేలు?

ఎంబీఏ మార్కెటింగ్‌ చేసి.. ఎంఎన్‌సీలో ఆరేళ్లు పనిచేశాను. నా వయసు 32 ఏళ్లు. ఇప్పుడు ఏ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగం సంపాదించొచ్చు?

Published : 02 May 2024 00:05 IST

ఎంబీఏ మార్కెటింగ్‌ చేసి.. ఎంఎన్‌సీలో ఆరేళ్లు పనిచేశాను. నా వయసు 32 ఏళ్లు. ఇప్పుడు ఏ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగం సంపాదించొచ్చు?

రామకృష్ణ ప్రకాశ్‌

మీరు ఎంబీఏలో మార్కెటింగ్‌ చదివి, ఆరేళ్లు ఉద్యోగం చేశారు కాబట్టి, ఆ రంగంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మీ ఉద్యోగావకాశాలు మెరుగు పర్చుకోవాలంటే డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, మార్కెటింగ్‌ అనలిటిక్స్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌, రిటైలింగ్‌, కంటెంట్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, గూగుల్‌ అనలిటిక్స్‌, మైక్రోసాఫ్ట్‌ అడ్వర్టయిజింగ్‌ సర్టిఫికేషన్‌, హబ్‌ స్పాట్‌ ఇన్‌ బౌండ్‌ మార్కెటింగ్‌ లాంటి కోర్సుల్లో శిక్షణ పొందండి. వీటితో పాటు డేటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, డేటా విజువలైజేషన్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని