మెడికల్‌ కోడింగ్‌ నేర్చుకోవాలంటే?

బీడీఎస్‌ చేశాను. మెడికల్‌ కోడింగ్‌ నేర్చుకుని త్వరగా ఉద్యోగం సంపాదించాలని ఉంది. ఈ కోర్సు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది?

Published : 06 May 2024 00:07 IST

బీడీఎస్‌ చేశాను. మెడికల్‌ కోడింగ్‌ నేర్చుకుని త్వరగా ఉద్యోగం సంపాదించాలని ఉంది. ఈ కోర్సు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది?

యు. స్వరూప

టీవలి కాలంలో మెడికల్‌ కోడింగ్‌ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతూ ఉంది. కొవిడ్‌ తరువాత మెడికల్‌ కోడింగ్‌ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ అయ్యాయి. దీనిలో శిక్షణ పొందినవారికి బీపీఓల్లో, హాస్పిటల్స్‌లో, ఇన్సూరెన్స్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. డెంటల్‌ కోర్సు చదివినవారికి కూడా ఈ రంగంలో మెరుగైన కెరియర్‌ ఉంటుంది. హైదరాబాద్‌ నగరంలో చాలా మెడికల్‌ కోడింగ్‌ శిక్షణ సంస్థలు ఉన్నాయి. మీ అవగాహన కోసం కొన్ని సంస్థల పేర్లు.. హైదరాబాద్‌లో- హెన్రీ హర్విన్‌, మెడేసన్‌, రెసాల్వ్‌ మెడికోడ్‌, ఐక్యా గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌, ట్రాన్స్‌కోడ్‌ సొల్యూషన్స్‌, ఇన్ఫోమెటిజ్‌, జోషి మేడికోడ్‌, గ్లోబల్‌ మెడికోడ్‌, క్లినిజెన్‌, మెడికాన్‌. విజయవాడలో- ఎస్‌ఆర్‌ టెక్నాలజీస్‌, టెక్నోస్పార్క్‌,  డెస్టినెక్స్ట్‌, ఎస్‌కేఎల్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌. వీటిలో చేరే ముందు సంస్థల విశ్వసనీయత గురించి తెలుసుకొని, నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్న నగరాల్లో శిక్షణ పొందితే, త్వరగా ఉద్యోగం పొందవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని