స్పీచ్‌ థెరపిస్టు అయ్యేదెలా?

స్పీచ్‌ థెరపిస్టు అవ్వాలని కోరిక. ఇందుకు ఏ విద్యార్హతలుండాలి? కోర్సు ఏ సంస్థలు అందిస్తున్నాయి?

Published : 08 May 2024 00:39 IST

స్పీచ్‌ థెరపిస్టు అవ్వాలని కోరిక. ఇందుకు ఏ విద్యార్హతలుండాలి? కోర్సు ఏ సంస్థలు అందిస్తున్నాయి?

శ్వేత

స్పీచ్‌ థెరపిస్ట్‌ అవ్వాలంటే-  స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ సైన్స్‌లో ప్రభుత్వ గుర్తింపు ఉన్న విద్యాసంస్థ నుంచి డిగ్రీ/ డిప్లొమా/ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. శిక్షణ పొందిన తర్వాత రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌సీఐ) గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాలి. జాతీయ స్థాయిలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌, మైసూరు మేటి సంస్థ. దీనికి అనుబంధంగా దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో అలీ యవార్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌, గురునానక్‌ విద్యాసంస్థలు, మా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌, హెలెన్‌ కెల్లర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌, కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారామెడికల్‌ సైన్సెస్‌, స్వీకార్‌ అకాడెమీ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ సైన్సెస్‌లు శిక్షణ అందిస్తున్నాయి. స్పీచ్‌ థెరపీకి సంబంధించిన కోర్సులను మేటి ప్రమాణాలున్న  సంస్థల్లో, ప్రత్యక్ష విధానంలో చదివితేనే నైపుణ్యాలు మెరుగవుతాయి. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఈ కోర్సుల్లో చేరవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని