అనువాదంతో ఏ అవకాశాలు?

అనువాదాన్ని వృత్తిగా ఎంచుకోవాలనుంది. ఈ రంగంలో ఉన్నత విద్యను అభ్యసిస్తే ప్రభుత్వ/ ప్రైవేటు రంగాల్లో ఏ ఉద్యోగావకాశాలుంటాయి?

Published : 27 May 2024 00:09 IST

అనువాదాన్ని వృత్తిగా ఎంచుకోవాలనుంది. ఈ రంగంలో ఉన్నత విద్యను అభ్యసిస్తే ప్రభుత్వ/ ప్రైవేటు రంగాల్లో ఏ ఉద్యోగావకాశాలుంటాయి?

- రమేష్‌ 

రాయి భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలనే నిర్బంధం లేకుండా అనువాదాల ద్వారా జ్ఞాన సముపార్జన చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రంగానికి ప్రాముఖ్యం పెరుగుతోంది. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యంతో మెషిన్‌ లెర్నింగ్‌ పద్ధతులతో యంత్ర అనువాద వ్యవస్థలు కూడా అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు, పరిశోధకులు, విలేఖరులు, అధికారులు, సమాచార కేంద్రాలు, వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాలు, సినిమా, బుల్లితెర వ్యవస్థల రంగాల్లో అనువాద వ్యవస్థలను వాడటం సాధారణం అవుతోంది. పైన చెప్పిన అన్ని రంగాల్లో అనువాదకుల అవసరం ఉంటుంది. జాతీయ విద్యావిధానం- 2020 నిబంధనల ప్రకారం ఉన్నత విద్యను కూడా మాతృభాషలో చదివే అవకాశం ఉంది. ఇంగ్లిష్, ఇతర విదేశీ భాషల్లో ఉన్న పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి చాలామంది అనువాదకులు అవసరం అవుతారు. ఈ రంగంలో ఉన్నత విద్యను అభ్యసిస్తే హిందీ, ప్రాంతీయ, విదేశీ భాషానువాదకులుగా, ప్రూఫ్‌ రీడర్లుగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, రాయబార కార్యాలయాల్లో, డిఫెన్స్‌ పరిశోధన సంస్థల్లో, వాణిజ్య ప్రకటనల సంస్థల్లో, యూనివర్సిటీల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో, బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ లాంటి బహుళ జాతి సంస్థల్లో, మొబైల్‌ ఫోన్‌ కంపెనీల్లో అనువాదకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని