డిగ్రీ చదవాలంటే...

మీరు ఏ సంవత్సరంలో డిగ్రీలో చేరారు? ఎన్నేళ్లు చదివారు? ఏ ఏడాది మానేశారు? డిగ్రీలో ఏ సబ్జెక్టులుు? మీ ప్రస్తుత వయసు, ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు...

Published : 05 Jun 2024 00:06 IST

డీఈడీ 2019లో పూర్తిచేశాను. తర్వాత డిగ్రీలో చేరి మధ్యలోనే మానేశాను. ఇప్పుడు డిగ్రీ చదవాలంటే ఏం చేయాలి?

బుజ్జి

  • మీరు ఏ సంవత్సరంలో డిగ్రీలో చేరారు? ఎన్నేళ్లు చదివారు? ఏ ఏడాది మానేశారు? డిగ్రీలో ఏ సబ్జెక్టులుు? మీ ప్రస్తుత వయసు, ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు...ఇవేమీ చెప్పలేదు. మొదటిగా మీరు డిగ్రీ చదివిన కళాశాలకు వెళ్లి ఇప్పుడు డిగ్రీని పూర్తి చేయడానికి అవకాశం ఉందో లేదో కనుక్కోండి. చాలా యూనివర్సిటీల్లో మూడు సంవత్సరాల డిగ్రీని గరిష్ఠంగా 5 లేదా 6 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ఒకవేళ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం డిగ్రీని పూర్తిచేయవచ్చంటే ఆ డిగ్రీని కొనసాగించండి. అలా వీలు కాకపోతే మళ్లీ డిగ్రీలో చేరి రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి చదువుకోండి. డీఈడీ విద్యార్హతతో ఏదైనా పాఠశాలలో టీచర్‌గా చేరి, దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేసే ప్రయత్నం చేయండి. చివరిగా, ఏదైనా ప్రైవేటు యూనివర్సిటీ లేదా ఓపెన్‌ యూనివర్శిటీ, లేదా రాష్ట్ర యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రాన్ని సంప్రదించి, గతంలో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టుల క్రెడిట్స్‌ని బదిలీ చేసి, ఆ సబ్జెక్టులు మినహా మిగతావి చదివి డిగ్రీ పూర్తిచేసే అవకాశం ఉందేమో తెలుసుకోండి. ఇవేవీ కుదరకపోతే, ఉద్యోగం చేస్తూనే డిగ్రీని ఆన్‌లైన్‌ పద్ధతిలో చదివే  ప్రయత్నం కూడా చేయొచ్చు. 

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని