నెట్‌కు అర్హత ఉంటుందా?

ఓపెన్‌ వర్సిటీ పీజీతో నెట్‌ రాయొచ్చా?

Published : 10 Jun 2024 00:33 IST

ఓపెన్‌ వర్సిటీ పీజీతో నెట్‌ రాయొచ్చా?

సోమశేఖర్‌

మీరు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ని సంప్రదాయ యూనివర్సిటీలో చదివినా, ఓపెన్‌ యూనివర్సిటీలో చదివినా, నిర్థారిత మార్కుల శాతం పొందినట్లైతే నిరభ్యంతరంగా నెట్‌/ సెట్‌ రాయవచ్చు. నెట్‌ రాయడానికి వయసుపరంగా గరిష్ఠ పరిమితి కూడా లేదు. నెట్‌లో ఉత్తీర్ణత పొందేవరకు ఎన్నిసార్లు అయినా రాస్తూనే ఉండొచ్చు. ఇటీవల యూజీసీ జారీ చేసిన నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ చేయాలంటే కచ్చితంగా నెట్‌లో మెరుగైన మార్కులు పొందాలి. సాధారణంగా ఏదైనా ఉద్యోగం చేసేవారు దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా పీజీ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు ఎలాంటి ఉద్యోగం చేయకుండా పీజీ చేయాలనుకుంటే రెగ్యులర్‌ విధానంలో చేయండి. రెగ్యులర్‌ విధానంలో పీజీ చదివితే నెట్, సెట్, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకు అవసరమయ్యే విషయ పరిజ్ఞానం పొందే అవకాశం ఉంది. రెగ్యులర్‌ డిగ్రీలకూ.. దూరవిద్య/ ఓపెన్‌ యూనివర్శిటీ డిగ్రీలకూ యూజీసీ పరంగా గుర్తింపులో ఎలాంటి తేడా లేదు. అయినప్పటికీ కొన్ని ప్రముఖ యూనివర్శిటీలు పీహెచ్‌డీ ప్రవేశాల్లో, అధ్యాపక నియామకాల్లో రెగ్యులర్‌ పీజీ చేసినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇతర దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి కూడా రెగ్యులర్‌ విధానంలో పీజీ చేయడం శ్రేయస్కరం. ఒకవేళ రెగ్యులర్‌ విధానంలో పీజీ చేసే అవకాశం లేకపోతే ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా పీజీ చేసి, రెగ్యులర్‌ విధానంలో చదివినవారితో పోటీ పడగలిగే విధంగా విషయ పరిజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని