ఆధునిక పీజీ కోర్సుల చిరునామా

న్యూదిల్లీలోని ప్రతిష్ఠాత్మక సంస్థ ఎయిమ్స్‌... వైవిధ్యభరితమైన ఆధునిక కోర్సులను అందిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకుని...

Published : 28 Mar 2016 02:38 IST

ఆధునిక పీజీ కోర్సుల చిరునామా

న్యూదిల్లీలోని ప్రతిష్ఠాత్మక సంస్థ ఎయిమ్స్‌... వైవిధ్యభరితమైన ఆధునిక కోర్సులను అందిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకుని, తగినవిధంగా సన్నద్ధమైతే ప్రవేశం పొందవచ్చు!

యిమ్స్‌ అనగానే చాలామంది ఎం.బి.బి.ఎస్‌., బి.డి.ఎస్‌., నర్సింగ్‌, ఎం.డి. మొదలైన వైద్యకోర్సులకు మాత్రమే సంబంధించినదని భావిస్తారు. కానీ ఇక్కడ ఎం.ఎస్‌.సి. ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్‌, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ, రిప్రొడక్టివ్‌ బయాలజీ, క్లినికల్‌ ఎంబ్రియాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ &మాస్టర్స్‌ ఇన్‌ బయోటెక్నాలజీ తదితర ఆధునిక కోర్సులు అభిస్తున్నాయి. ఈ సంస్థ గత 29 సంవత్సరాల నుంచి మాస్టర్స్‌ ఇన్‌ బయోటెక్నాలజీ కోర్సును అందిస్తోంది.

ఎం.ఎస్‌.సి. నర్సింగ్‌లో కార్డియోలాజికల్‌/ సి.టి.వి.ఎస్‌., నర్సింగ్‌, అంకాలాజికల్‌ నర్సింగ్‌, న్యూరోసైన్స్‌ నర్సింగ్‌, నెఫ్రాలాజికల్‌ నర్సింగ్‌, క్రిటికల్‌ కేర్‌ నర్సింగ్‌; పెడియాట్రిక్‌ నర్సింగ్‌, సైకియాట్రిక్‌ నర్సింగ్‌ అనే ప్రత్యేక కోర్సులున్నాయి.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అయిన బి.ఎస్‌.సి. (ఆనర్స్‌) నర్సింగ్‌, బ్యాచులర్‌ ఆఫ్‌ అప్టోమెట్రి, బి.ఎస్‌.సి. (ఆనర్స్‌) మెడికల్‌ టెక్నాలజీ ఇన్‌ రేడియోగ్రఫీ, బి.ఎస్‌.సి. నర్సింగ్‌ (పోస్ట్‌ బేసిక్‌) కోర్సులను కూడా అందిస్తోంది.

ఎం.ఎస్‌.సి. &మాస్టర్స్‌ ఇన్‌ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్షలకు అభ్యర్థులు విడివిడిగా దరఖాస్తు చేయాలి.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అయిన బ్యాచులర్‌ ఆఫ్‌ అప్టోమెట్రీ, బి.ఎస్‌.సి. (ఆనర్స్‌), మెడికల్‌ టెక్నాలజీ ఇన్‌ రేడియోగ్రఫీ కోర్సులకు అభ్యర్థులు ఒకే దరఖాస్తు పత్రం పంపుకోవచ్చు.

ఎం.ఎస్‌.సి. & మాస్టర్స్‌ ఇన్‌ బయోటెక్నాలజీ

ఈ ప్రవేశపరీక్షలకు ఎం.బి.బి.ఎస్‌./ బి.డి.ఎస్‌. కోర్సులను 55% మార్కులతో పూర్తిచేసిన జనరల్‌ కేటగిరీ, ఓబీసీ విద్యార్థులు, 50% మార్కులతో పూర్తిచేసిన ఎస్‌.సి., ఎస్‌.టి. వారు అర్హులు. బి.వి.ఎస్‌.సి. (లేదా) బి.ఫార్మసీ (లేదా) బ్యాచురల్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (లేదా) బి.టెక్‌ బయోటెక్నాలజీ (లేదా) బి.ఎస్‌.సి. ఏదైనా సబ్జెక్టుల్లో పూర్తిచేసినవారు, ఫైనలియర్‌ విద్యార్థులు 60% మార్కులతో పూర్తిచేసిన జనరల్‌ కేటగిరీ & ఓబీసీ వారు, 55% మార్కులతో పూర్తిచేసిన ఎస్‌.సి., ఎస్‌.టి. విద్యార్థులు అర్హులు.

ఎం.ఎస్‌.సి. పర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీఈ ప్రవేశ పరీక్షకు బి.ఎస్‌.సి. (బి.జెడ్‌.సి.) విద్యార్థులు లేదా బి.ఎస్‌.సి. ఇన్‌ పర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ వారు అర్హులు.

ఎం.ఎస్‌.సి. రిప్రొడక్టివ్‌ బయాలజీఈ ప్రవేశ పరీక్షకు బి.ఎస్‌.సి. బయాలజీ విద్యార్థులు అర్హులు.

న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ ఈ ప్రవేశ పరీక్షకు బి.ఎస్‌.సి.లో న్యూక్లియర్‌ మెడిసిన్‌ చదివినవారు లేదా బి.ఎస్‌.సి.లో ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్‌ చదివినవారు లేదా బి.ఎస్‌.సి.లో అలైడ్‌/ రిలేటెడ్‌ సబ్జెక్ట్‌ రేడియో డైగ్నోసిస్‌/ రేడియోథెరపీ చదివినవారు లేదా బి.ఎస్‌.సి. లైఫ్‌ సైన్స్‌ విత్‌ ఫిజిక్స్‌ చదివినవారు అర్హులు.

ఎం.ఎస్‌.సి. నర్సింగ్‌ ఈ ప్రవేశ పరీక్షకు బి.ఎస్‌.సి. ఆనర్స్‌ నర్సింగ్‌ చదివినవారు లేదా బి.ఎస్‌.సి. 4 సంవత్సరాల నర్సింగ్‌ చదివినవారు లేదా బి.ఎస్‌.సి. నర్సింగ్‌ పోస్ట్‌ బేసిక్‌ చదివినవారు అర్హులు. నర్స్‌, ఆర్‌.ఎన్‌., ఆర్‌.ఎం. గుర్తింపు పొందిన విద్యార్థులు కూడా అర్హులు.

బి.ఎస్‌.సి. నర్సింగ్‌ (ఆనర్స్‌), బ్యాచులర్‌ ఇన్‌ అప్టోమెట్రీ & బి.ఎస్‌.సి. (ఆనర్స్‌) మెడికల్‌ టెక్నాలజీ ఇన్‌ రేడియోగ్రఫీ

ఈ ప్రవేశ పరీక్షకు 10+ 2లో బై.పి.సి. లేదా ఎమ్‌.పి.సి. లేదా ఎమ్‌.బై.పి.సి. చదివినవారు అర్హులు.

బి.ఎస్‌.సి. నర్సింగ్‌ (ఆనర్స్‌)కు విద్యార్థినులు మాత్రమే అర్హులు. ఈ కోర్సును న్యూదిల్లీ ఎయిమ్స్‌తోపాటు 6 కొత్త ఎయిమ్స్‌లు భోపాల్‌, భువనేశ్వర్‌, జోధ్‌పూర్‌, పాట్నా, రాయిపూర్‌, రిషికేశ్‌ అందిస్తున్నాయి.

 


 

పరీక్ష విధానం

ఎం.ఎస్‌.సి., మాస్టర్స్‌ ఇన్‌ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. 90 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 90 ని॥లలో సమాధానం రాయాలి. సరైన సమాధానానికి +1 మార్కు, తప్పు జవాబుకు -1/3 మార్కులు ఉంటాయి. ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో రాయాలి.

ఎం.ఎస్‌.సి. నర్సింగ్‌: ఈ ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష కూడా ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. 90 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 90 ని॥లలో సమాధానాలు రాయాలి. సరైన జవాబుకు +1 మార్కు, తప్పు జవాబుకు- 1/3 మార్కులు.

బి.ఎస్‌.సి. నర్సింగ్‌ (ఆనర్స్‌): ఈ ఆన్‌లైన్‌ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 120 ని॥లలో సమాధానాలు రాయాలి. ప్రశ్నపత్రంలో నాలుగు భాగాలుంటాయి. పార్ట్‌ ఏలో ఫిజిక్స్‌ 30 మార్కులకు, పార్ట్‌ బీలో కెమిస్ట్రీ 30 మార్కులకు, పార్ట్‌ సీలో బయాలజీ 30 మార్కులకు, పార్ట్‌ డీలో జనరల్‌ నాలెడ్జి 10 మార్కులకు ఉంటుంది. సరైన సమాధానానికి +1 మార్కు, తప్పు సమాధానానికి - 1/3 మార్కులు.

బ్యాచులర్‌ ఆఫ్‌ అప్టోమెట్రీ & బి.ఎస్‌.సి. (ఆనర్స్‌) మెడికల్‌ టెక్నాలజీ ఇన్‌ రేడియోగ్రఫీ: ఈ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. 90 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 90 ని॥లలో సమాధానాలు రాయాలి. ఈ ప్రశ్నపత్రంలోని పార్ట్‌ ఏలో ఫిజిక్స్‌ 30 మార్కులకు, పార్ట్‌ బిలో కెమిస్ట్రీ 30 మార్కులకు, పార్ట్‌ సీలో బయాలజీ 30 మార్కులకు, పార్ట్‌ డీలో మ్యాథ్స్‌ 30 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. కానీ బయాలజీ, మ్యాథ్స్‌ విభాగంలో ఏదైనా ఒక విభాగాన్ని మాత్రమే ఎంపిక చేసుకొని ప్రశ్నలకు సమాధానం రాయాలి. సరైన జవాబుకు +1, తప్పు జవాబుకు - 1/3 మార్కు.

బి.ఎస్‌.సి. నర్సింగ్‌ (పోస్ట్‌ బేసిక్‌): ఈ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశ ప్రవేశ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ పద్ధతి. 70 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు 90 ని॥ల వ్యవధిలో సమాధానాలు రాయాలి. మొదటి దశలో అధిక మార్కులు సాధించిన మెరిట్‌ విద్యార్థులకు రెండో దశలో పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సరైన జవాబుకు +1 మార్కు, తప్పు జవాబుకు - 1/3 మార్కులు.

ఎయిమ్స్‌ గత 29 ఏళ్ళుగా మాస్టర్స్‌ ఇన్‌ బయోటెక్నాలజీ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు ప్రవేశపరీక్ష రాసేవారు బి.ఎస్‌.సి. బోటనీ, జువాలజీ సిలబస్‌తో పాటు మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌ సిలబస్‌ అంశాలపై దృష్టి పెట్టాలి.

ఇలా సన్నద్ధం కావాలి

ఎం.ఎస్‌.సి.& మాస్టర్స్‌ ఇన్‌ బయోటెక్నాలజీ ప్రవేశపరీక్ష రాసే విద్యార్థులు మొదట 10+2 బయాలజీ సిలబస్‌తో సన్నద్ధత మొదలుపెట్టాలి. తర్వాత ఎం.ఎస్‌.సి. ఏ స్పెషలైజేషన్‌లో ప్రవేశపరీక్ష రాస్తున్నారో సంబంధిత విభాగంలోని సిలబస్‌ నుంచి మాత్రమే ప్రశ్నలను అడుగుతారు కాబట్టి సంబంధిత సిలబస్‌ను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.

ఎం.ఎస్‌.సి. ఎనాటమీ: ఈ ప్రవేశపరీక్ష రాసే విద్యార్థులు బి.ఎస్‌.సి. బయాలజీ సిలబస్‌తో పాటు ఎనాటమీ సిలబస్‌ మీద అధిక దృష్టి కేంద్రీకరించాలి. మైక్రోస్కోపిక్‌ ఎనాటమీ, సైటోజెనెటిక్స్‌, న్యూరోబయాలజీ, ఎంబ్రియాలజీ, గ్రాస్‌ ఎనాటమీ, అప్లైడ్‌ ఇమ్యునాలజీ మొదలైన సిలబస్‌ను అనువర్తిత ధోరణిలో క్షుణ్ణంగా చదవాలి.

ఎం.ఎస్‌.సి. బయోకెమిస్ట్రీ: ఈ ప్రవేశపరీక్ష రాసేవారు బి.ఎస్‌.సి. బయాలజీ సిలబస్‌తో పాటు బయోకెమిస్ట్రీ సిలబస్‌ మీద అధిక దృష్టి పెట్టాలి. సెల్‌ బయాలజీ, ఇమ్యూనాలజీ, ఆర్‌.డి.ఎస్‌.ఎ. టెక్నాలజీ, రిప్రొడక్టివ్‌ బయాలజీ, ఎంజైమ్స్‌, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ తదితర సిలబస్‌ను అనువర్తిత ధోరణిలో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.

ఎం.ఎస్‌.సి. బయోఫిజిక్స్‌: ఈ ప్రవేశపరీక్ష అభ్యర్థులు బి.ఎస్‌.సి. బయాలజీ సిలబస్‌తో పాటు బేసిక్‌ ఫిజిక్స్‌, బయోఫిజిక్స్‌ సిలబస్‌ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. పెప్‌టైడ్‌ డిజైన్‌, పెప్‌టైడ్‌ సింథసిస్‌, ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ, ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపి, మాలిక్యులర్‌ డైనమిక్స్‌, ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపి తదితర సిలబస్‌ను అనువర్తిత ధోరణిలో శ్రద్ధగా చదవాలి.

ఎం.ఎస్‌.సి. ఫార్మకాలజీ: ఈ ప్రవేశపరీక్ష అభ్యర్థులు బి. ఫార్మసీ సిలబస్‌ మీద అధికదృష్టి కేంద్రీకరించాలి. ఫార్మకాలజీ, టాక్టికాలజీ, న్యూరోఫార్మకాలజీ, కీమోథెరపీ మొదలైన సిలబస్‌ను బాగా అధ్యయనం చేయాలి.

ఎం.ఎస్‌.సి. ఫిజియాలజీ: ఈ ప్రవేశపరీక్షార్థులు బి.ఎస్‌.సి. బయాలజీ సిలబస్‌తో పాటు ప్లాంట్‌ ఫిజియాలజీ, యానిమల్‌ ఫిజియాలజీ, సెల్‌ బయాలజీ సిలబస్‌ను శ్రద్ధగా చదవాలి.

మాస్టర్స్‌ ఇన్‌ బయోటెక్నాలజీ: ఈ ప్రవేశపరీక్ష రాసేవారు బి.ఎస్‌.సి. బోటనీ, జువాలజీ సిలబస్‌తో పాటు మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌ సిలబస్‌ అంశాలపై దృష్టి పెట్టాలి.

ఎం.ఎస్‌.సి. నర్సింగ్‌: ఈ ప్రవేశపరీక్ష రాసే విద్యార్థులు బి.ఎస్‌.సి. నర్సింగ్‌ సిలబస్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.

బి.ఎస్‌.సి. నర్సింగ్‌ (ఆనర్స్‌): ఈ ప్రవేశపరీక్షార్థులు 10 + 2 ఫిజిక్స్‌ సిలబస్‌, కెమిస్ట్రీ సిలబస్‌, బయాలజీ సిలబస్‌లను అనువర్తిత ధోరణిలో చదవాలి. ఈ పరీక్షలో జనరల్‌ నాలెడ్జ్‌ విభాగం ప్రశ్నలు అడుగుతారు కాబట్టి దీనిపై కూడా దృష్టి కేంద్రీకరించాలి.

ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ (www.aiimsexams.org) ను పరిశీలించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని