అదనంగా ఏ కోర్సులు?

ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ స్పెషలైజేషన్లలో ఎంబీఏ పూర్తిచేశాను. అదనంగా కోర్సులు చేద్దామనుకుంటున్నాను.

Published : 06 Dec 2017 01:53 IST

అదనంగా ఏ కోర్సులు?

ప్ర: ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ స్పెషలైజేషన్లలో ఎంబీఏ పూర్తిచేశాను. అదనంగా కోర్సులు చేద్దామనుకుంటున్నాను. ఏవి మేలు?

- కె. అశ్విని

జ: ముందుగా ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోండి. మీకు ఫైనాన్స్‌ రంగంలోని స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఈక్విటీవైపు మొగ్గు ఉంటే నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) వారు అందిస్తున్న ఎన్‌సీఎఫ్‌ఎం కోర్సులను ఎంచుకుని, పూర్తిచేయవచ్చు. బ్యాంకింగ్‌ రంగంలో ఆసక్తి ఉంటే డిప్లొమా లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కోర్సులను ఎంచుకోవచ్చు.

మార్కెటింగ్‌లో అయితే.. డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మార్కెటింగ్‌, ఎస్‌ఈఓ, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. అంకెలు, సమస్య సాధన, మేథమేటిక్స్‌లో చురుకుదనం ఉంటే అనలిటిక్స్‌ కోర్సులను ఎంచుకుని ఆర్‌ పైథాన్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను ఎంచుకోవచ్చు.

మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని, తరువాత మీకు ఆసక్తి ఉన్న కోర్సులను ఎంచుకోండి. వివిధ MOOC's(మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌) కోసం edx.org, courseera.com వెబ్‌సైట్లను సందర్శించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని