జర్నలిజం కోర్సులో చేరాలంటే..?

ఇంటర్‌ పూర్తిచేసి, డీఈడీ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు జర్నలిజం చదవాలనుంది...

Published : 10 Jul 2018 03:39 IST

జర్నలిజం కోర్సులో చేరాలంటే..?

ఇంటర్‌ పూర్తిచేసి, డీఈడీ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు జర్నలిజం చదవాలనుంది. తరువాత ఏ కోర్సు ఎంచుకుంటే మేలు?

- యర్రంశెట్టి లిఖిత  

జర్నలిజంపై ఆసక్తి ఉన్నవారు జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ డిగ్రీ కోర్సును ఎంచుకోవచ్చు. మీరు ఎలాగూ టీచర్‌ ట్రైనింగ్‌ పొందుతున్నారు కాబట్టి, దూరవిద్యా విధానంలోనూ ఈ కోర్సును అభ్యసించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు ఈ కోర్సు (జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌)లో డిప్లొమా, డిగ్రీలను దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి. ఇగ్నో ద్వారా కూడా ఈ కోర్సును అభ్యసించవచ్చు. జర్నలిజంలోనే మీ కెరియర్‌ను సాగించాలంటే  డీఈడీ పూర్తయ్యాక జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సును ఇంజిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌-దిల్లీ, ఎంఐసీఏ-అహ్మదాబాద్‌, సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో జర్నలిజం కోర్సును పూర్తిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని