Weather Report: అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ

రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Published : 26 Apr 2024 15:10 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఉదయం 11 గంటల నుంచి 3గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణశాఖ తెలిపింది. ఎల్లుండి (ఆదివారం) రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గతేడాది కంటే ఈసారి ఎండలు మండిపోతున్నాయి.. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు