Computer Optitude: కుదించడానికి పనికొచ్చే ఫైల్?

రైల్వే, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), ఇతర పోటీ పరీక్షల్లో ‘కంప్యూటర్ ఆప్టిట్యూడ్’ ఉంటుంది. ఈ విభాగంలో అధిక మార్కులు సాధించాలంటే ఏ మెలకువలు పాటించాలి?
కంప్యూటర్ రకాల గురించి విద్యార్థులు పూర్తి అవగాహన పెంచుకుంటే ఏ విధంగా ప్రశ్నలడిగినా జవాబులు ఇవ్వగలుగుతారు.
విరివిగా వాడుతున్న రంగాలు: విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, శాస్త్ర సాంకేతిక, ప్రింటింగ్ లాంటి వివిధ రంగాల్లో మనుషులు చేయగల పనులే కాక, మనుషులు చేయలేని ఎన్నో పనులను చాలా వేగంగా, పూర్తి కచ్చితత్వంతో కంప్యూటర్లు చేయగలుగుతున్నాయి. నిత్యజీవితంలో కంప్యుటర్ల వినియోగం తప్పనిసరి అయింది.
కంప్యూటర్ విభాగాలైన ఇన్‌పుట్ యూనిట్ అంటే ఏమిటి, సి.పి.యు. ఇన్‌పుట్ యూనిట్ విభాగాలు, మెమరీల్లో రకాలైన ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ ఎలా పనిచేస్తాయి అనే విషయాలు తెలుసుకోవాలి. వీటిపై గత పరీక్షల్లో ఇచ్చిన ఒక ప్రశ్నను చూద్దాం.
ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం మొదలైనవి ఈ రూపంలో నిల్వ చేస్తారు...
ఎ) ఫైల్    బి) ఫోల్డర్ 
సి) టెక్ట్స్   డి) డేటా
జవాబు: ఎ
ఒక్కటి లేదా అంతకన్నా ఎక్కువ ఫైళ్లను కుదించడానికి ఉపయోగపడే ఫైల్ కింది వానిలో ఏది?
ఎ) EXE      బి) PDF
సి) DOC     డి) ZIP 
జవాబు: డి
వివిధ ఇన్‌పుట్ పరికరాలైన కీ బోర్డ్, మౌస్, స్కానర్, జాయ్ స్టిక్, ట్రాక్ బాల్, బార్ కోడ్ రీడర్, మాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ (MICR), ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ (OMR), మైక్రో ఫోన్, వెబ్ కెమెరా లాంటి పరికరాలు, అవి చేయగలిగిన పనుల గురించి నేర్చుకోవాలి.
కంప్యూటర్‌లో స్కైప్ పనిచేయడానికి కింది వాటిలో ఏది అవసరం?
1) వెబ్ కామ్ 2) మైక్రో ఫోన్ 3) స్పీకర్
ఎ) 1, 2 మాత్రమే
బి) 1, 2, 3 
సి) 2, 3 మాత్రమే 
డి) 1, 3 మాత్రమే
జవాబు: బి
కీ బోర్డ్ షార్ట్ కట్స్ పై గత పరీక్షల్లో ఇచ్చిన ఒక ప్రశ్నను చూద్దాం.
విండోస్ OSలో ఫైల్ లేదా ఫోల్డర్ పేరు మార్చడానికి సాధార ణంగా ఉపయోగించే కీబోర్డ్ షార్ట్‌కట్‌లు ఏవి?
ఎ) CTRL + R
బి) F2
సి) Ctrl + F5
డి) Alt + Enter
జవాబు: బి


డా. చెన్నంశెట్టి రమేష్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ట్రంప్ టారిఫ్లకు ‘నీల్’ చెక్ పెట్టేనా..! ఎవరీ భారత సంతతి లాయర్..?
 - 
                        
                            

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించం: మంత్రి అనిత
 - 
                        
                            

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
 - 
                        
                            

తెదేపా క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
 - 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 


