క్యాన్సర్లు పెరుగుతున్నాయి

చిన్నవయసులోనే.. అంటే 50 ఏళ్లలోపే క్యాన్సర్లు తలెత్తటం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మూడు దశాబ్దాల నుంచి రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కిడ్నీ, కాలేయం, క్లోమ క్యాన్సర్ల వంటివి గణనీయంగా

Published : 27 Sep 2022 00:25 IST

చిన్నవయసులోనే.. అంటే 50 ఏళ్లలోపే క్యాన్సర్లు తలెత్తటం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మూడు దశాబ్దాల నుంచి రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కిడ్నీ, కాలేయం, క్లోమ క్యాన్సర్ల వంటివి గణనీయంగా పెరిగినట్టు హార్వర్డ్‌ టి.హెచ్‌. చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆహారం, జీవనశైలి, బరువు, పర్యావరణ ప్రభావాలు, పేగుల్లో సూక్ష్మజీవుల తీరుతెన్నులు మారిపోవటం దీనికి కారణమవుతున్నట్టు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారం తినటం, శారీరక శ్రమ, నిద్ర తగ్గిపోయాయని.. అదే సమయంలో మద్యం అలవాటు ఎక్కువైందని పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. చిన్నవయసులో బయటపడుతున్న 14 రకాల్లో 8 క్యాన్సర్లు జీర్ణకోశానికి సంబంధించినవే కావటం గమనార్హం. మనం తినే ఆహారం పేగుల్లోని సూక్ష్మక్రిములకూ ఆహారంగా ఉపయోగపడుతుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన టొమటక ఉగాయ్‌ చెబుతున్నారు. పేగుల్లో సూక్ష్మక్రిముల తీరుతెన్నుల మీద ఆహారం నేరుగా ప్రభావం చూపుతుందని, ఇది చివరికి జబ్బుల ముప్పు పెరగటానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని