తామరకు ఆవాలు

తామర (రింగ్‌వార్మ్‌) చాలా చికాకు పెడుతుంది. దీని నుంచి ఉపశమనం పొందటానికి ఆవాలు ఉపయోగపడతాయి. ముందుగా చర్మాన్ని వేడి నీటితో శుభ్రంగా కడగాలి.

Published : 17 Jan 2023 00:28 IST

తామర (రింగ్‌వార్మ్‌) చాలా చికాకు పెడుతుంది. దీని నుంచి ఉపశమనం పొందటానికి ఆవాలు ఉపయోగపడతాయి. ముందుగా చర్మాన్ని వేడి నీటితో శుభ్రంగా కడగాలి. బట్టతో అద్ది తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత ఆవాలను ముద్దగా నూరి సమస్య ఉన్నచోట పూయాలి. తామరకు బొప్పాయి కాయ కూడా మేలు చేస్తుంది. రోజుకు రెండు సార్లు బొప్పాయి కాయ ముక్కలను రుద్దుతుంటే ఫలితం కనిపిస్తుంది. ఎండిన బొప్పాయి గింజల ముద్దను కూడా రాసుకోవచ్చు. తామర తగ్గటానికి ఆముదమూ ఉపయోగ పడుతుంది. దీన్ని చర్మానికి బాగా రాస్తే రెండు మూడు రోజుల్లో గుణం కనిపిస్తుంది. తాజా కూరగాయల రసం.. ముఖ్యంగా క్యారెట్‌, పాలకూర రసం తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది. క్యారెట్‌ రసం 200 మి.లీ., పాలకూర రసం 300 మి.లీ. కలిపి తీసుకుంటే మేలు. వీలైనంత తాజా గాలి తగిలేలా చూసుకోవటమూ ముఖ్యమే. తగినన్ని నీళ్లు తాగాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. తామర ఉన్నచోట కొబ్బరినూనె రాస్తే చర్మం మృదువుగా అవుతుంది. ఉదయం పూట కాసేపు ఎండకు నిలబడటం మంచిది. అరగంట చొప్పున రోజుకు రెండు సార్లు బురద పట్టీ వేసినా తామర తగ్గటానికి తోడ్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని