బ్యాక్టీరియాతో పొడి కళ్లు

కళ్లు పొడిబారటం (డ్రై ఐస్‌) పెద్ద సమస్య. ప్రపంచవ్యాపంగా ఎంతోమంది దీంతో ఇబ్బంది పడుతుంటారు.

Published : 02 Apr 2024 00:04 IST

ళ్లు పొడిబారటం (డ్రై ఐస్‌) పెద్ద సమస్య. ప్రపంచవ్యాపంగా ఎంతోమంది దీంతో ఇబ్బంది పడుతుంటారు. ఇందులో కంటిలోని బ్యాక్టీరియా పాత్ర కూడా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. పేగుల్లోనే కాదు.. చర్మం, నోరు, ముక్కు, చెవులు, కళ్ల వంటి భాగాల్లోనూ సూక్ష్మక్రిములు (మైక్రోబయోమ్‌) మనతో సహ జీవనం చేస్తుంటాయి. కళ్లు పొడిబారటం వంటి చర్మ సమస్యల్లో వీటి పాత్ర మీద పరిశోధకులు చాలాకాలంగా దృష్టి సారించారు. ఆరోగ్యకరమైన, పొడిబారిన కళ్లలో సూక్ష్మక్రిముల్లో వ్యత్యాసాలు ఉంటున్నట్టు అమెరికాకు చెందిన స్టీఫెన్‌ ఎఫ్‌. ఆస్టిన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా గుర్తించారు. పేగుల్లోని సూక్ష్మక్రిముల సమతుల్యత లోపిస్తే వ్యాధికారక క్రిములు, వీటి నుంచి ఉత్పత్తయ్యే పదార్థాలు రక్తం ద్వారా ఇతర భాగాలకూ విస్తరిస్తాయి. కళ్లూ దీనికి మినహాయింపు కాదు. అంటే పేగుల్లోని క్రిములే కళ్లలోనూ ఉంటాయని అనుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్న కళ్లలో స్ట్రెప్టోకాకస్‌, పెడోబ్యాక్టీరియా రకం క్రిములు ఎక్కువగా ఉంటుంటే.. పొడి కళ్లలో అసినెటోబ్యాక్టర్‌ బ్యాక్టీరియా జాతులు అధికంగా ఉంటున్నట్టు బయటపడింది. కళ్లు పొడిబారటాన్ని తగ్గించే కొత్త రకం చికిత్సల రూపకల్పనకు ఇది దోహదం చేయగలదని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు