చికాకు పేగులకు ఆహార కవచం

కడుపుబ్బరం, కడుపునొప్పి, విరేచనాలు లేదా మలబద్ధకం.. ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) ఇలాంటి లక్షణాలతోనే వేధిస్తుంది. ఇదేమీ తీవ్రమైన సమస్య కాదు గానీ తెగ ఇబ్బంది పెడుతుంది. కొందరు ఏం తింటే ఏమవుతుందో అని భయపడుతూ..

Published : 15 May 2018 01:24 IST

చికాకు పేగులకు ఆహార కవచం

కడుపుబ్బరం, కడుపునొప్పి, విరేచనాలు లేదా మలబద్ధకం.. ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) ఇలాంటి లక్షణాలతోనే వేధిస్తుంది. ఇదేమీ తీవ్రమైన సమస్య కాదు గానీ తెగ ఇబ్బంది పెడుతుంది. కొందరు ఏం తింటే ఏమవుతుందో అని భయపడుతూ.. పోషణలోపంలోకీ జారిపోతుంటారు. అయితే ఐబీఎస్‌ను ప్రేరేపిస్తున్న అంశాలేంటో గుర్తించి, వాటికి దూరంగా ఉండటం ఎంతో మేలు చేస్తుంది.* మలబద్ధకంతో బాధపడేవారు పొట్టుతీసిన పదార్థాలు, ఆహార ఉత్పత్తులు, కాఫీ, కూల్‌డ్రింకులు, మద్యం, ప్రోటీన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది. ఆహారం ద్వారా తగినంత పీచు లభించేలా చూసుకోవాలి.
* విరేచనాలతో సతమతమయ్యేవారు పొట్టుతీయని ధాన్యాలతో చేసిన పదార్థాలు, పండ్లు, కూరగాయలు తగ్గించుకోవాలి. క్యాబేజీ, గోబీపువ్వు, చాక్లెట్లు, మద్యం, కూల్‌డ్రింకులు, కాఫీ, వేపుళ్ల వంటివి  మానెయ్యాలి.
* ఒత్తిడిని తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ధ్యానం, యోగా ఎంతగానో ఉపయోగపడతాయి.
* గబగబా మెక్కటం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు తినటం మానెయ్యాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని