గుండెను నవ్వించండి

మన భావోద్వేగాలకూ గుండె ఆరోగ్యానికీ బలమైన సంబంధం ఉంది. కోపం, కుంగుబాటు...

Published : 30 Aug 2016 02:21 IST

గుండెను నవ్వించండి

న భావోద్వేగాలకూ గుండె ఆరోగ్యానికీ బలమైన సంబంధం ఉంది. కోపం, కుంగుబాటు, ఆందోళన, ఒంటరితనం వంటివి గుండెజబ్బు ముప్పు పెరగటానికి దోహదం చేస్తే.. నవ్వు, సంతోషం వంటివి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. నవ్వినపుడు రక్తనాళాల లోపలి గోడల్లోని పొర (ఎండోథిలియం) విచ్చుకొని రక్త ప్రసరణ మెరుగవుతుంది. మెదడులోని హైపోథలమస్‌లో బీటా-ఎండార్ఫిన్లు పుట్టుకొస్తాయి. ఇవి రక్తనాళాలు విప్పారేలా చేసే నైట్రిక్‌ ఆక్సైడ్‌ను విడుదలయ్యేలా చేస్తాయి. కార్టిజోల్‌, ఎపినెఫ్రిన్‌ వంటి ఒత్తిడి హార్మోన్లు సైతం తగ్గుముఖం పడతాయి. అంతేకాదు.. నవ్వినపుడు యాంటీబాడీలను ఉత్పత్తి చేసే కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. కాబట్టి వీలైనంతవరకు మీరు నవ్వుతూ.. గుండెనూ నవ్వించండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని