Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 May 2024 13:11 IST

1. వైఎస్‌ షర్మిలపై కేసు నమోదు

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్‌ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. పూర్తి కథనం

2. బనగానపల్లిలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ.. రాళ్లదాడిలో ఆరుగురికి గాయాలు

తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని సంతమార్కెట్‌లో వైకాపా, తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. తొలుత వైకాపా ప్రచారం ముగియగా.. ఆ తర్వాత తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి ఇందిరమ్మ తమ పార్టీ నేతలతో అక్కడికి వెళ్లారు. పూర్తి కథనం

3. రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!

సార్వత్రిక ఎన్నికల వేళ ఝార్ఖండ్‌ (Jharkhand) రాజధాని రాంచీలో గుట్టలుగా డబ్బులు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర మంత్రి ప్రైవేటు కార్యదర్శి పనిమనిషి ఇంటి నుంచి ఈడీ (ED) అధికారులు సోమవారం రూ.32కోట్లను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అవినీతి బండారం బయటికొచ్చింది రూ.10వేల లంచం కేసుతోనే..!పూర్తి కథనం

4. ఇజ్రాయెల్‌ ఆధీనంలో రఫా క్రాసింగ్‌

గాజా (Gaza)లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్‌ (Hamas) అంగీకారం తెలిపినప్పటికీ.. ఇజ్రాయెల్‌ (Israel) తమ రఫా ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉంది. ఈ పట్టణంలోకి యుద్ధ ట్యాంక్‌లతో అడుగుపెట్టిన ఐడీఎఫ్‌ దళాలు.. తాజాగా గాజా వైపున ఉన్న రఫా సరిహద్దు క్రాసింగ్‌ (Rafah crossing)ను ఆధీనంలోకి తీసుకున్నాయి.పూర్తి కథనం

5. ‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు

ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను (Maldives) సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో పూర్తిగా పర్యటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ విజ్ఞప్తి చేశారు.పూర్తి కథనం

6. పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్‌ రిపబ్లిక్‌ కోర్టు..!

ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసులో అమెరికా దర్యాప్తు సంస్థల ఉత్సాహానికి చెక్‌ రిపబ్లిక్‌లో బ్రేకులు పడ్డాయి. ఈ కేసులో నిందితుడు భారతీయుడు నిఖిల్‌ గుప్తాను వాషింగ్టన్‌కు అప్పగించే విషయమై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. పూర్తి కథనం

7. నిలిచిపోయిన సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (Sunita Williams) రోదసి యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ (Boeing Starliner) వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్‌లో సాంకేతికత లోపం తలెత్తడమే దీనికి కారణం. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. పూర్తి కథనం

8. నెల క్రితం ప్రమోషన్‌.. ఇప్పుడు లేఆఫ్‌.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!

టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. చాలా మంది తమ ఉద్వాసన పట్ల షాక్‌కు గురవుతున్నారు. తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ఓ ప్రముఖ నివేదిక ప్రకారం.. ఏప్రిల్‌లో టెక్‌ కంపెనీలు దాదాపు 21,500 మంది ఉద్యోగులను తీసేశాయి. గత నెల తొలగింపులు టెస్లాతో (Tesla) ప్రారంభమయ్యాయి. అందులో ఓ భారత టెకీ కూడా ఉన్నారు.పూర్తి కథనం

9. కేసీఆర్‌ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారు: బండి సంజయ్‌

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లే అని భాజపా ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. హామీలు ఎందుకు అమలు కావడం లేదో ఆ పార్టీ జవాబు చెప్పాలన్నారు.  పూర్తి కథనం

10. దటీజ్‌ ధోనీ.. లోయర్‌ ఆర్డర్‌లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఆవేశం ఎక్కువ.. తాము ఊహించింది జరగకపోతే అసలు విషయం తెలుసుకోకుండానే విమర్శలకు దిగుతారు. తాజాగా ధోనీ (MS Dhoni) విషయంలో కూడా ఫ్యాన్స్‌ ఇలానే ప్రవర్తిస్తున్నారా.. అనే సందేహాలు కలగక మానవు. చెన్నై జట్టు ధర్మశాల వేదికగా పంజాబ్‌తో తలపడింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని