Healthy Heart: ఈ 10 టిప్స్‌తో... మీ గుండె పదిలం!
ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా... గుండె పోటు (Heart Attack)కు గురవుతున్నాం అని బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుండె (Heart)కు మంచి చేసే పది టిప్స్ (Health Tips) చూద్దాం!
చూడ్డానికి పిడికెడంతే ఉంటుంది గానీ చెట్టంత మనిషిని నిలబెడుతుంది. గుండె ‘బలం’ అలాంటిది! నిరంతరాయంగా లబ్ డబ్ మని కొట్టుకుంటూ (Heart beat).. అన్ని అవయవాలకు రక్తాన్ని పంప్ చేసే ఇది చతికిలబడితే శరీరం చేతులెత్తేస్తుంది. అలాంటి గుండె (Heart)ను జాగ్రత్తగా కాపాడుకోవటానికి పాటిద్దాం పది సూత్రాలు. (Tips for healty heart)
- వాహనాలు, లిఫ్ట్‌లు అందుబాటులోకి వచ్చాక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. వీలైనప్పుడల్లా నడవటం, మెట్లు ఎక్కటం ద్వారా దీన్ని భర్తీ చేసుకోవచ్చు.
- ఒత్తిడితో గుండె వైఫల్యం, గుండెపోటు ముప్పు పెరుగుతుంది. రోజూ కనీసం 20 నిమిషాల సేపు ధ్యానం చేస్తే ఒత్తిడి పలాయనం చిత్తగిస్తుంది.
- కార్టిజోల్ వంటి హార్మోన్లు గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. వ్యాయామంతో ఇలాంటి హార్మోన్ల స్థాయులు ఉద్ధృతం కాకుండా చూసుకోవచ్చు.
- నిద్రలేమితో రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెజబ్బుకు దారితీస్తుంది. రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోతే గుండె ఆరోగ్యమూ పుంజుకుంటుంది.
- నవ్వటం వల్ల రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది. అందువల్ల సమయం దొరికినప్పుడు జోక్స్ చదవండి. నవ్వు తెప్పించే సినిమాలు చూడండి.
- గుండె కూడా కండరమే. దీనికీ ప్రోటీన్లు అవసరమే. చిక్కుళ్లు, బఠానీలు, చేపలతో పాటు బాదం, పిస్తా వంటి గింజపప్పులు తీసుకోండి.
- అధిక బరువు గుండెకూ చేటే. బరువు పెరగటం వల్ల గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఆహార, వ్యాయామాలతో బరువు పెరగకుండా చూసుకోవాలి.
- జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. దీంతో మధుమేహం ముప్పు పెరుగుతుంది. మధుమేహానికీ గుండెజబ్బుకూ లంకె ఉందన్న సంగతి తెలిసిందే.
- అప్పుడప్పుడు యాత్రలకు వెళ్లండి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఒంటికి ఎండ తగిలితే విటమిన్ డి కూడా లభిస్తుంది. ఇవి గుండెకు మేలు చేస్తాయి.
- తగినంత నీరు తాగండి. ఒంట్లో నీటిశాతం తగ్గితే రక్తం చిక్కబడుతుంది. గుండెజబ్బు గలవారికిది మరింత హాని చేస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన