వృక్షాలే అయ్యాయి శిల్పాలు!

ఒక మోడు వారిన చెట్టు... కథలో పాత్రగా మారింది. విరిగిన చెట్టుపైకి ఓ డ్రాగన్‌ ఎక్కేసింది. ఇంకో వృక్షం మనిషిగా మారిపోయింది. ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా? ఆకట్టుకునే రూపాల్లోకి మారిపోయిన చెట్ల సంగతులు.

Published : 04 Jun 2016 01:00 IST

వృక్షాలే అయ్యాయి శిల్పాలు!

ఒక మోడు వారిన చెట్టు... కథలో పాత్రగా మారింది. విరిగిన చెట్టుపైకి ఓ డ్రాగన్‌ ఎక్కేసింది. ఇంకో వృక్షం మనిషిగా మారిపోయింది. ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా? ఆకట్టుకునే రూపాల్లోకి మారిపోయిన చెట్ల సంగతులు.

కథల్లో పాత్రలుగా!

మెరికా మోంట్‌వాలోలోని ‘ఓర్‌ పార్కు’లో వృక్షాలకు ఒక ప్రత్యేకత ఉంది. అవి పేరుకు మోడువారినవే అయినా ప్రాచీనగాధల్లోని పాత్రల్లా, వింత జీవుల్లా, సరదా ఆకారాల్లో కనువిందుచేస్తాయి. ఇలాంటివి మొత్తం 30 వరకు ఉంటాయి.

ఇంతకీ వీటిని ఎవరు ఎందుకు చేశారు? 1983లో వచ్చిన భారీ తుపానుతో ఇక్కడి చెట్లన్నీ పడిపోయాయి. ఎక్కడికక్కడే విరిగిపోయాయి. వీటన్నింటినీ తొలగించబోతుంటే టిమ్‌ టింగిల్‌ అనే కళాకారుడికి ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. దాంతో ఎన్నో ఏళ్లు శ్రమించి వాటిని ఇలా వింత ఆకారాల్లో తీర్చిదిద్దాడు. రూపానికి తగ్గట్టు కళ్లు, కనుబొమలు, నోరు, పళ్లు ఇలా అన్ని సహజమైన వాటిలానే ఉండేలా చక్కగా చెక్కాడు.

వీధుల్లో బొమ్మలుగా!


కెనడా అంటారియోలోని ఆరెంజ్‌విల్లా నగర వీధుల్లో దాదాపు 60కి పైగా వృక్షాలు అలరించే బొమ్మలుగా కనబడతాయి. ఇక్కడ చెట్ల మొద్దుల్నే ప్రముఖుల రూపాలు, రకరకాల సన్నివేశాలతో ఉన్న వ్యక్తులుగా, జంతువులుగా వైవిధ్యమైన శిల్పాలుగా తీర్చిదిద్దారు. వయసైపోతున్న చెట్లనే ఇలా అందమైన కళారూపాలుగా చేసిపెట్టారు. రంగులతో ఉండటంతో ‘ఇవి నిజమైన రూపాలా’ అన్న భ్రమను కల్గిస్తాయి. ఈ రకంగా నగర వీధులే ఆర్ట్‌ గ్యాలరీలుగా మారిపోయాయన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని