KKR: రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్‌కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు.

Updated : 07 May 2024 10:51 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రతికూల వాతావరణం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) ఆటగాళ్లు  ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని రెండుసార్లు దారి మళ్లించారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను కోల్‌కతా జట్టు తమ ఎక్స్‌ (X)ఖాతాలో పంచుకుంది. వివరాల్లోకి వెళితే.. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో ఆదివారం మ్యాచ్‌ ముగించుకుంది. మే 11న ముంబయి ఇండియన్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు సోమవారం సాయంత్రం లఖ్‌నవూ నుంచి 5.45 గంటలకు ఛార్టర్డ్ విమానంలో కోల్‌కతాకు బయలుదేరింది. విమానం 7,25 గంటలకు ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా.. కోల్‌కతాలో కుండపోత వర్షాలతో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో విమానాన్ని గువాహటికి దారి మళ్లించారు. 

గువాహటికి చేరుకున్న తర్వాత కోల్‌కతా బయలుదేరడానికి క్లియరెన్స్‌ వచ్చింది. దీంతో ప్లైట్‌ కోల్‌కతా బయలుదేరింది. కానీ, మరోసారి  వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వారణాసికి దారి మళ్లించారు. సోమవారం రాత్రి కోల్‌కతా ఆటగాళ్లు అక్కడే ఓ హోటల్‌లో బస చేశారు. మంగళవారం మధ్యాహ్నం కేకేఆర్ ప్లేయర్స్‌ ఛార్టర్డ్ ప్లైట్‌ వారణాసి నుంచి కోల్‌కతాకు బయలుదేరుతుంది. 

గత కొన్ని రోజులుగా కోల్‌కతా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ, సోమవారం సాయంత్రం అక్కడ కుండపోత వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ వరదనీటితో నిండిపోయాయి. ఇక, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొడుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ జట్టు దాదాపు ప్లే ఆఫ్స్‌కు చేరినట్టే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని