చెట్టు మేలు తెలుసుకో! మొక్క నాటి మురిసిపో!!

చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తాయి... మనం విడుదల చేసే కార్బన్‌డయాక్సైడ్‌ను తీసుకుంటాయి... - ఇలాంటివన్నీ మీరు పాఠ్యపుస్తకాల్లో చదువుకుని ఉంటారు!

Published : 20 Jul 2016 02:46 IST

చెట్టు మేలు తెలుసుకో! మొక్క నాటి మురిసిపో!!

చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తాయి... మనం విడుదల చేసే కార్బన్‌డయాక్సైడ్‌ను తీసుకుంటాయి... - ఇలాంటివన్నీ మీరు పాఠ్యపుస్తకాల్లో చదువుకుని ఉంటారు! కానీ మీకు తెలియని అద్భుతమైన నిజాలు ఎన్నో ఉన్నాయి! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హరిత హారం’, ‘వన భారతి - జన హారతి’ కార్యక్రమాల ద్వారా కోట్లాది మొక్కలు నాటుతున్నారని తెలుసుగా? ఈ సందర్భంగా మరిన్నినిజాలను తెలుసుకోండి... ఆ విశేషాలు చదివిన స్ఫూర్తితో మీరూ మొక్కలు నాటండి!


* చెట్లు సహజ ఎయిర్‌ కండీషన్‌లా పనిచేస్తాయి. ఒక చెట్టు ఆకుల ద్వారా రోజుకు 375 లీటర్ల నీటిని గాలిలోకి తేమ రూపంలో వదులుతుంది. అందుకే చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది. ఇది 10 ఎయిర్‌ కండీషన్లు ఇరవై గంటలు పనిచేస్తే వచ్చేంత చల్లదనంతో సమానం!
* ఒక ఎకరం విస్తీర్ణంలో దట్టంగా ఉండే చెట్లు ఏటా 13 టన్నుల దుమ్ము, ధూళిలను వాతావరణం నుంచి తొలిగిస్తాయి!
* ఒక కారు 26,000 మైళ్లు తిరిగితే విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడ్‌ని ఒక చెట్టు ఏడాదిలో గ్రహిస్తుంది!
* చెట్లు తమ వేళ్ల ద్వారా భూగర్భ జలాల నుంచి ప్రమాదకరమైన కాలుష్యాన్ని తొలిగించి శుద్ధి చేస్తాయి!
* భూమిపై ఉన్న 80,000 జాతుల మొక్కల ద్వారా మనకు ఎన్నో రకాల ఆహారం లభిస్తోంది!
* ఒక చెట్టు దాని జీవిత కాలం మొత్తంలో టన్ను కార్బన్‌డయాక్సైడ్‌ను తీసుకుంటుంది!
* భూమ్మీద ఉత్పత్తి అవుతున్న ప్రాణ వాయువులో 20 శాతం అమెజాన్‌ అడవి నుంచే వస్తోందిట. అందుకే అమెజాన్‌ను ‘లంగ్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’ అని అంటారు!


* ఇంటి చుట్టూ చెట్లు ఎక్కువగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పుట్టే పిల్లలు కూడా సరైన బరువుతో పుడతారట!
* పచ్చని చెట్లను చూస్తే ఒత్తిడి తగ్గిపోతుంది. వ్యాధులు కూడా త్వరగా నయం అవుతాయిట!
* 70,000 జాతుల మొక్కల్ని రకరకాల ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు!
* ఒక ఏడాదిలో ఒక చెట్టు.. నలుగురికి ఏడాదిపాటు అవసరమయ్యే ఆక్సిజన్‌ని విడుదల చేస్తుంది!
* చెట్లు ఎక్కువగా ఉన్న చోట నేరాల శాతం తక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.
* మనం పారేసే చెత్తను పునర్వినియోగం చేసుకుని పోషకాలుగా మార్చుకుంటుందిట.
* చెట్లు ఆకుల నుంచి నీటిని గాల్లోకి పంపి వాతావరణాన్ని వేడెక్కకుండా చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని