logo

ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్‌.. యువ జంట వినూత్న నిర్ణయం

మండలంలోని ఎండ్రియల్‌ గ్రామానికి చెందిన ఓ యువ జంట తమ 10వ వివాహ వార్షికోత్సవం  సందర్భంగా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

Updated : 08 May 2024 08:45 IST

శ్రావణలక్ష్మి, తిరుపతిరెడ్డి దంపతులు

ఎండ్రియల్‌(తాడ్వాయి), న్యూస్‌టుడే: మండలంలోని ఎండ్రియల్‌ గ్రామానికి చెందిన ఓ యువ జంట తమ 10వ వివాహ వార్షికోత్సవం  సందర్భంగా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తమ నిర్ణయంతో ఆడపిల్లకు గౌరవం చేకూరుతుందని దంపతులు రెడ్డిగారి శ్రావణలక్ష్మి, తిరుపతిరెడ్డిలు చెబుతున్నారు. జనవరి ఒకటి 2024 నుంచి గ్రామంలో జన్మించిన ప్రతి ఆడపిల్లకి తమ వంతు సహాయంగా తపాలాఖాతా తెరిచి ఒక్కొక్కరికి రూ. 2 వేల నగదును డిపాజిట్‌ చేయనున్నట్లు చెప్పారు.  వారి నిర్ణయాన్ని గ్రామస్థులు అభినందిస్తున్నారు. ‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు