కావలిలో ఇంకా తొలగించని డబుల్‌ ఓట్లు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్‌ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు.

Updated : 08 May 2024 08:48 IST

దొంగ ఓట్లు వేయడానికేనని ఆరోపణలు

కావలి, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్‌ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. అయినప్పటికీ తుది ఓటరు జాబితాలో కొంతమంది వైకాపా మద్దతుదారులకు ఇంకా రెండేసి ఓట్లు అలాగే ఉన్నాయి. పట్టణంలో వెంగళరావునగర్‌ ప్రాంతం పరిధిలోని 52 మందికి రెండేసి ఓట్లు ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వారంతా పోలింగ్‌ కేంద్రాలను మార్చుకునేందుకు గతంలో ఫాం-8 ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దాంతో అధికారులు వారు కోరుకున్న చోటుకు మార్చారు. అయితే పాత పోలింగ్‌ కేంద్రంలోని ఓట్లు మాత్రం తొలగించలేదు. ఇవన్నీ రెండు చోట్ల ఒకే ఎపిక్‌ నంబరుతో ఉండడం గమనార్హం. ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి వీటిని ఉపయోగించుకుంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు మార్పులకు అవకాశం లేదు

వారు గతంలో పోలింగ్‌ కేంద్రాల మార్పునకు దరఖాస్తు చేసుకోగా కొత్త పోలింగ్‌ కేంద్రానికి మార్చాం. అయితే పాత కేంద్రాల్లో ఓట్లు తొలగించకపోవడంతో అక్కడ అలాగే ఉన్నాయి. ఇప్పుడు మార్పులకు అవకాశం లేదు. ఏఎస్‌డీ విధానంలో వారు రెండు ఓట్లు వేయకుండా చూస్తాం.

 శీనానాయక్‌, కావలి ఆర్వో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు