logo

పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం 1962లో ఏర్పడగా 62 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు(వి.తులసీరాం, గడ్డం వెంకటస్వామి) రెండు, అంతకంటే ఎక్కువసార్లు విజయం సాధించారు.

Updated : 08 May 2024 07:55 IST

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం 1962లో ఏర్పడగా 62 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు(వి.తులసీరాం, గడ్డం వెంకటస్వామి) రెండు, అంతకంటే ఎక్కువసార్లు విజయం సాధించారు. మిగతా వారంతా ఒక్కసారికే పరిమితం కాగా మరికొందరికి పోటీ చేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో భాజపా తరఫున పోటీపడుతున్న గోమాసె శ్రీనివాస్‌ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈయన ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులతో తలపడుతుండటం విశేషం. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి(ప్రస్తుత భారాస)తరఫున అభ్యర్థిగా నిలబడి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీలో ఉన్న గడ్డం వివేక్‌తో తలపడ్డారు. ఈ 2024 ఎన్నికల్లో ఇదే పార్టీ నుంచి వివేక్‌ కుమారుడు వంశీకృష్ణ బరిలో ఉండగా ఇప్పుడు కూడా గోమాసె శ్రీనివాస్‌ పోటీపడుతుండటం గమనార్హం. ఈసారి భాజపా నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీనివాస్‌ అప్పుడు తండ్రి వివేక్‌, ఇప్పుడు కొడుకు వంశీకృష్ణతో పోటీపడటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని